మొసలికి ఆహారం పెట్టబోయి తానే !! ఒళ్లు గగుర్లు పొడిచే వీడియో

|

Jan 20, 2022 | 9:00 AM

మొసలికి ఆహారం పెడుతున్న మహిళనే తినేయబోయింది ఓ మొసలి.. ఆ మొసలి బారినుంచి ఎలాగోతప్పించుకుని బతుకుజీవుడా అంటూ బయటపడింది సదరు మహిళ.

మొసలికి ఆహారం పెడుతున్న మహిళనే తినేయబోయింది ఓ మొసలి.. ఆ మొసలి బారినుంచి ఎలాగోతప్పించుకుని బతుకుజీవుడా అంటూ బయటపడింది సదరు మహిళ. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియో మొసలి స్వభావం ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతోంది. ఒళ్లు గగుర్లు పొడిచేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ జూలో మొసలిని ప్రదర్శనకు ఉంచారు. అదే సమయంలో మొసలి బాధ్యతలు చూసుకుంటున్న ఓ మహిళా ట్రైనర్‌ దానికి చేతితో ఏదో ఆహారం ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయితే ఆ మొసలి మాత్రం ఆహారంతో పాటు ఆ మహిళ చేతిని కూడా నోటిన కరుచుకొని ఒక్కసారిగా నీటిలోకి లాగేసింది. అంతటితో ఆగని ఆ మొసలి సదరు మహిళను గిర్రున తిప్పేసింది. మహిళ మొసలి నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా అది వదల్లేదు. దీంతో అక్కడే ఉన్న మరో ట్రైనర్‌ ఆ మొసలిపైకి దూకి సదరు మహిళను తప్పించేందుకు ప్రయత్నించాడు.

Also Watch:

Viral Video: సైగలతో ఆర్డర్‌ చేస్తేనే ఆ హోటల్‌లో భోజనం !! వీడియో

Viral Video: వామ్మో !! 1,019 అక్షరాలతో ఎంత పెద్ద ‘పేరు’ !! వీడియో

Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టాడు !! అంతే షాక్‌ !! వీడియో

కొంటే ఇలాంటి ఇల్లే కొనాలి !! చూస్తే వావ్ అంటారు !! వీడియో