Scooty: అర్జంట్‌గా బయటకు వెళ్లాలని హడావిడిగా బైక్‌ తీస్తున్నారా.. జాగ్రత్త..! స్కూటీలోంచి వింత శబ్దాలు..

Updated on: Sep 26, 2022 | 9:58 AM

ఇటీవల వర్షాలు, వరదల కారణంగా పుట్టల్లోనో, అటవీ ప్రాంతాల్లోనో ఉండాల్సిన పాములు, కొండచిలువలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఎక్కడ వీలైతే అక్కడ దూరిపోయి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.


ఇటీవల వర్షాలు, వరదల కారణంగా పుట్టల్లోనో, అటవీ ప్రాంతాల్లోనో ఉండాల్సిన పాములు, కొండచిలువలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఎక్కడ వీలైతే అక్కడ దూరిపోయి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి అంగుళం ఎంతో జాగ్రత్తగా గమనించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. ఎందుకో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.ఏదో పనిమీద బయటకు వెళ్దామని స్కూటీ తీయబోయాడు ఓ వ్యక్తి. అయితే అందులోంచి వింత శబ్దాలు వినిపించాయి. ఏమిటా అని చెక్ చేస్తే అందులోంచి బుస్సుమని ఓ పెద్ద నాగుపాము బయటకు వచ్చింది. ఈ వైరల్ వీడియో అందరిని అలర్ట్ చేస్తుంది. ఈ గగుర్పాటు కలిగించే వీడియోలో స్కూటీ హ్యాండిల్‌లో ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ఎలా మాటువేసి కూర్చుని ఉంది. హ్యాండిల్ కదిలించిన వెంటనే అది బుసలు కొడుతూ పడగ విప్పింది. పామును పట్టుకున్న వ్యక్తి దానిని వాటర్ బాటిల్‌లో బంధించి, తరువాత దానిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లి వదిలిపెట్టాడు.ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. మళ్లీ వైరల్ అవుతోంది. దీనిని IFS అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. వీడియోను షేర్ చేస్తూ.. వర్షాకాలంలో ఇలాంటి అతిథులు సర్వసాధారణం, కానీ వాటిని సేవ్ చేయడానికి ఉపయోగించే పద్ధతి అసాధారణమైనది.. కావున ఎప్పుడూ ఇలా ప్రయత్నించవద్దు అంటూ సూచించారు. ఈ వీడియోను ఇప్పుడు కూడా వేలమంది వీక్షిస్తూ లైక్‌ చేస్తున్నారు. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Loading...
Unable to load recommendations.
Follow Us