6 నెలలుగా బాలికకు కడుపునొప్పి.. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్ వీడియో
చైనాకు చెందిన నిని అనే 15 ఏళ్ల బాలిక ఆరు నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. ఆమెకు నెలసరి కూడా రాకపోవడంతో ఆహారం తినకపోవడంతో ఆందోళన చెందిన బాలిక తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఆ బాలిక బరువు కేవలం 35 కిలోలు మాత్రమే ఉందని ఎత్తు కూడా 1.6 మీటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు స్కానింగ్ ఇతర టెస్ట్ లు నిర్వహించగా ఆమె కడుపులో ఏకంగా 2 కిలోల బరువున్న హెయిర్ బాల్ ని గుర్తించి షాక్ అయ్యారు.
విషయం తల్లికి చెప్పగా తన కుమార్తె గత ఆరు సంవత్సరాలుగా తన జుట్టును తానే లాక్కొని తింటుందని తెలిపింది. రిపోర్ట్స్ ఆధారంగా బాలికకు తీవ్రమైన రక్తహీనత ఉందని తేలింది. అంతేకాదు ఆమె కడుపులో వెంట్రుకలన్నీ పెద్ద సైజు బంతులా తయారైనట్లుగా వైద్యులు గుర్తించారు. దీంతో జులై 14న ఆమెకు ఆపరేషన్ చేసి హెయిర్ బాల్ ని తొలగించారు. వైద్యులు ఆమె కడుపు నుండి వెంట్రుకలను బయటకు తీసినప్పుడు అందరూ దాన్ని చూసి షాక్ అయ్యారు. ఆగస్టు 5న చెకప్ కోసం వచ్చిన నిని వైద్యులకు స్వీట్స్ తో చేసిన బోకేను అందజేసి కృతజ్ఞతలు తెలిపింది. తన కుమార్తె బరువు పెరుగుతుందని బాగానే కోలుకుంటుందని ఆమె తల్లి చెప్పారు. గతంలో జైపూర్ లోని సావాయ్ మాన్సింగ్ ఎస్ ఎం ఎస్ ఆసుపత్రిలో ఇలాంటి కేసు నమోదైంది. ఇక్కడ 14 ఏళ్ల బాలిక కడుపు నుండి 210 సెంటీమీటర్ల పొడవున్న వెంట్రుకలను తొలగించారు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నివాసి అయిన ఈ 14 ఏళ్ల బాలిక దాదాపు ఒక నెల నుండి కడుపు నొప్పి వాంతులతో బాధపడుతున్నట్లుగా తల్లిదండ్రులు చెప్పారు. వైద్యులు ఆమెను పరీక్షించినప్పుడు ఆమె కడుపులో చాలా గట్టి పొడవైన గడ్డ ఉందని గుర్తించారు. అనంతరం ఆపరేషన్ చేసి కడుపులో పేరుకుపోయిన వెంట్రుకలను తొలగించారు. అప్పట్లో కడుపులో నుండి తొలగించబడిన అతి పొడవైన వెంట్రుకల ముద్ద ఇదేనని చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం
భాగస్వామి కోపంగా ఉన్నరా.. ఈ తప్పులు అస్సలే చేయకండి వీడియో!
ప్రాణం తీసిన కోడిగుడ్డు.. నోట్లో పెట్టుకోగానే వీడియో
శ్రీశైలం సమీపంలో దారుణం.. నిద్రిస్తున్న చిన్నారిని లాక్కెళ్లిన చిరుత..
వంట చేద్దామని కిచెన్‌లోకి వెళ్లిన మహిళ.. మూలన కనిపించింది చూసి..
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
