Viral Video: కాలేజీ స్నాతకోత్సవంలో దుమ్మురేపిన అమ్మాయి.. స్టంట్‌ వైరల్ వీడియో..

Updated on: Mar 18, 2023 | 6:20 PM

మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తడంలో సోషల్ మీడియా ముందుంటుంది. ఎన్నెన్నో వింతైన, విచిత్రమైన విషయాలను నెటిజెన్లు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో..

మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తడంలో సోషల్ మీడియా ముందుంటుంది. ఎన్నెన్నో వింతైన, విచిత్రమైన విషయాలను నెటిజెన్లు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజెన్లను బాగా ఆకట్టుకుంటోంది. డిగ్రీ పట్టా స్వీకారోత్సవంలో చైనా యువతి చేసిన సర్కస్‌ స్టంట్‌‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రతి విద్యార్థి జీవితంలో డిగ్రీ పట్టా పొందే క్షణాలు ఒక అద్భుతమైన అనుభూతినిస్తాయి. ఈ క్షణాలను ఒక్కొక్కరు ఒక్కోలా తమకు నచ్చిన రీతిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు. చైనాకు చెందిన ఓ యువతి అందరిలా కాకుండా విభిన్నంగా డిగ్రీ పట్టా స్వీకారోత్సవాన్ని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి నెటిజన్‌ల మనసు దోచుకుంది. బీజింగ్‌ నగరానికి చెందిన చెన్‌ యీనింగ్‌ అనే 24 ఏళ్ల యువతి ఇంగ్లండ్‌లోని రోహంప్టన్‌ యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఆ కోర్సుకు సంబంధించిన గ్రాడ్యుయేషన్‌ సెరమనీ జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యక్తిని చెన్‌ తోటి విద్యార్థులంతా సాధారణంగా విష్‌ చేస్తూ వెళ్లారు. కానీ చెన్‌ మాత్రం తనదైన శైలిలో కుంగ్‌ ఫూ స్టైల్‌ సర్కస్‌ ఫీట్స్‌ చేస్తూ వెళ్లి విష్‌ చేసింది. చైనాకు వెళ్లిన అనంతరం ఆ వీడియోను చెన్‌ ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో చెన్‌ యీనింగ్‌ తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురుస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 18, 2023 06:20 PM
Loading...
Unable to load recommendations.
Follow Us