Viral Video: పానీపూరీ అమ్ముతున్న చిన్నారులు.. మీ జన్మ ధన్యం అంటున్న నెటిజన్లు.. సంచలనంగా మారిన వీడియో..

|

Mar 10, 2022 | 9:58 AM

ఉత్తరాది కి అడుగు పెట్టిన గోల్ గొప్పకు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. తెలుగునాట పానీపూరిగా పిలుచుకునే ఈ స్నాక్ ఐటెంను పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ ఇప్పుడు వివాహాల్లో కూడా ఓ ఫుడ్‌ అయిటమ్‌గా చేరిపోయింది.


ఉత్తరాది కి అడుగు పెట్టిన గోల్ గొప్పకు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. తెలుగునాట పానీపూరిగా పిలుచుకునే ఈ స్నాక్ ఐటెంను పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ ఇప్పుడు వివాహాల్లో కూడా ఓ ఫుడ్‌ అయిటమ్‌గా చేరిపోయింది. తాజాగా ఈ పానీపూరీకి సంబంధించి ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో ఏదో పెళ్లో… మరేదో శుభకార్యానికి సంబంధించినదిలా కనిపిస్తోంది. ఈ వీడియోలో పానీ-పూరీ సర్వ్ చేసే వ్యక్తి తన స్టాల్‌లో ఉన్నట్లు లేడు. దాంతో అతిథులు పానీపూరీ కోసం క్యూ కట్టడంతో అక్కడే ఉన్న కొందరు చిన్నారులు రంగంలోకి దిగారు. ఆ చిన్నారులు పానీ పూరీ స్టాల్ కి వచ్చిన అతిథులందరికీ తమదైన శైలిలో గోల్గప్పలు తినిపిస్తున్నారు. ఈ ఫంక్షన్‌లో పానీపూరీ డిమాండ్‌ను తీర్చడానికి బాలల సైన్యం సిద్ధంగా ఉంది. అయితే ఈ చిన్నారులు చేతులకు గ్లౌజులు వేసుకోలేదు.. సరికదా.. మురికి చేతులతో పపూరీలను నీటిలో ముంచుతూ.. సర్వ్ చేస్తున్నారు. చిన్నారులు ఉన్న తీరుని చూసి ఫంక్షన్‌కు వచ్చిన అతిథులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియోను ఓ యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియో మిలియన్లమంది వీక్షిస్తూ.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇది చూస్తే పార్టీలకు వెళ్లడం మానుకోవాలనిపిస్తుంది అంటున్నారు. అంతేకాదు ‘ఈ గోల్గప్పను ఎవరు తింటారో వారు ఖచ్చితంగా చిరంజీవులు అవుతారని కామెంట్‌ చేసారు. మరొక వినియోగదారుడు.. ‘ఈ గోల్గప్పా తిన్న తర్వాత, కరోనా మహమ్మారి కూడా మీకు హాని కలిగించదంటూ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ‘పెళ్లిలో స్టఫ్డ్ ఫుడ్ తినే అతిథులకు ఇది తినిపించాలి… మళ్ళీ ఎప్పుడూ పానీ పూరీ వైపు చూడరు అంటూ ఇంకొందరు వ్యాఖ్యానించారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..