Chicken Manchurian: మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే.. ఏ ఊరిదో తెలుసా?

Updated on: Aug 03, 2026 | 8:10 AM

చికెన్ మంచూరియా చైనాకు చెందిన వంటకం కాదని, ముంబైలో చెఫ్ నెల్సన్ వాంగ్ 1970లలో సృష్టించిన ఇండో-చైనీస్ వంటకమని చాలా మందికి తెలియదు. భారతీయుల రుచికి తగ్గట్టుగా రూపొందించిన ఈ వంటకం తర్వాత దేశవ్యాప్తంగా అపార ప్రజాదరణ పొందింది. పేరు విదేశీదైనా, రుచి మాత్రం పూర్తిగా భారతీయమేనని ఆహార నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో చైనీస్ ఫుడ్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది చికెన్ మంచూరియా. రెస్టారెంట్లు, వీధి బండ్ల వద్ద అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ వంటకం చైనాకు చెందిందని అందరూ భావిస్తారు. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వంటకానికి.. చైనా దేశానికి గానీ, అక్కడి మంచూరియా ప్రాంతానికి గానీ ఎలాంటి సంబంధం లేదు. ఇది అచ్చంగా మన దేశంలో, మన ముంబైలో పుట్టిన ఒక దేశీ ఆవిష్కరణ. 1970వ దశకంలో ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా లో పనిచేసే చైనీస్-ఇండియన్ చెఫ్ నెల్సన్ వాంగ్ ఈ వంటకాన్ని సరికొత్తగా ఆవిష్కరించారు. ఒక కస్టమర్ విభిన్నమైన వంటకం చేయమని అడగడంతో.. వేయించిన కోడి మాంసం ముక్కలకు సోయా సాస్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చితో చేసిన ఘాటైన సాస్‌ను జోడించి ఇచ్చారు. ఆ రుచికి కస్టమర్ ఫిదా అవ్వడంతో ‘చికెన్ మంచూరియా’ పుట్టుకొచ్చింది. ఆ తర్వాత నెల్సన్ వాంగ్ ‘చైనా గార్డెన్’ రెస్టారెంట్ ద్వారా దీనికి దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చారు. ఆహార నిపుణుల ప్రకారం.. చైనీస్ వంట పద్ధతులను భారతీయ రుచులకు అనుగుణంగా మార్చే ‘ఇండో-చైనీస్’ లేదా ‘చిండియన్’ వంటకాలకు మంచూరియా ఒక చక్కటి ఉదాహరణ. పేరు విదేశీది అయినా, దాని ఆత్మ, రుచి పూర్తిగా భారత్ దే. నేడు వీధి బండ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు మంచూరియా రారాజుగా వెలుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విదేశాల్లో వర్క్‌ చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌!

లేడీ ఏసీపీ సాహసం… కదులుతున్న బస్సుకు ఎదురుగా నిలబడి

ఆహా స్కెచ్‌ అంటే నీదే బాస్‌.. అప్పు తీర్చడానికి ఏం ప్లాన్‌ చేసాడు..!

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ కొత్త రూల్స్‌ తెలుసుకోకపోతే నష్టమే!

Loading...
Unable to load recommendations.
Follow Us