Chhattisgarh: శివంగిలా దూకి.. ఎనిమిది మందితో తండ్రిని రక్షించుకుంది.!
పదిహేడేళ్ల అమ్మాయి. ఏడో తరగతితోనే చదువు ఆపేసింది. పనికిమాలిన పిల్ల అంటూ ఊర్లో అంతా హేళన చేశారు. తనను ఎవరు ఏమన్నా నవ్వుతూ భరించింది. కానీ, కన్నవాళ్లకు ఆపదొస్తే చూస్తూ ఊరుకుంటుందా? శివంగిల దూకి రక్షించుకుంది. ఛత్తీస్‌గఢ్ జారా గ్రామంలో ఆగష్టు 7వ తేదీ సాయంత్రం.. సోమ్దర్ కొర్రం అనే వ్యక్తి ఇంటిపైకి ఆయుధాలతో ఎనిమిది మంది వచ్చారు. పదునైన ఆయుధాలతో మెడ మీద వేటు వేయాలని ప్రయత్నించారు.
పదిహేడేళ్ల అమ్మాయి. ఏడో తరగతితోనే చదువు ఆపేసింది. పనికిమాలిన పిల్ల అంటూ ఊర్లో అంతా హేళన చేశారు. తనను ఎవరు ఏమన్నా నవ్వుతూ భరించింది. కానీ, కన్నవాళ్లకు ఆపదొస్తే చూస్తూ ఊరుకుంటుందా? శివంగిల దూకి రక్షించుకుంది. ఛత్తీస్‌గఢ్ జారా గ్రామంలో ఆగష్టు 7వ తేదీ సాయంత్రం.. సోమ్దర్ కొర్రం అనే వ్యక్తి ఇంటిపైకి ఆయుధాలతో ఎనిమిది మంది వచ్చారు. పదునైన ఆయుధాలతో మెడ మీద వేటు వేయాలని ప్రయత్నించారు. కానీ, ఆయన తప్పించుకోవడంతో అది ఛాతీలో దిగబడింది. ఆ వెంటనే మరో దెబ్బతో ఆయన ప్రాణం తీయాలని ప్రయత్నించారు.
అయితే ఆ అలికిడికి కొర్రం కూతురు సుశీల.. ఒక్క ఉదుటున వాళ్ల మధ్యకు చేరింది. తండ్రిని చుట్టుముట్టిన నలుగురు ఆగంతకులపై పిడిగుద్దులు కురిపించింది. ఆ పెనుగులాటలో ఒకరి చేతిలో గొడ్డలి లాక్కుని.. కింద రక్తపు మడుగులో ఉన్న తండ్రికి రక్షణ కవచంలా నిలిచింది. అయితే..బయట నలుగురు కాపలా.. లోపల నలుగురు. వాళ్లతో ఎక్కువసేపు ఒంటరిగా పోరాడలేనని ఆమెకు అర్థమైంది. సాయం కోసం గట్టి గట్టిగా కేకలు వేసింది. ఆ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరారు. అప్రమత్తమైన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సాయంతో జగదల్‌పూర్‌లోని దిమ్రాపాల్ ఆస్పత్రికి తీవ్రంగా గాయపడ్డ తండ్రిని తీసుకెళ్లింది. సకాలంలో చికిత్స అందడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో.. ఇది మావోయిస్టుల పనని ముందు ప్రచారం జరిగింది. కానీ, పోలీస్ విచారణలో కాదని తేలింది. భూ తగాదాలతో ఆయన చిన్న తమ్ముడే ఈ దాడి చేయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

