ఫోన్‌లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి!

Updated on: Jul 15, 2026 | 8:11 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో విచిత్ర చోరీ చోటుచేసుకుంది. రెండు కేజీల చికెన్ కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళ, షాపు యజమాని ఫోన్‌లో బిజీగా ఉన్న సమయంలో మరో కస్టమర్ కోసం సిద్ధం చేసిన 10 కేజీల చికెన్‌ను చాకచక్యంగా ఎత్తుకెళ్లింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

బంగారం, వెండి, నగదు దొంగతనాల గురించి మనం వింటూనే ఉంటాం. గ్రామాల్లో కోళ్లు, మేకలను ఎత్తుకెళ్లడం కూడా మామూలే. కానీ, కట్ చేసి పెట్టిన చికెన్ మాంసాన్ని దొంగిలించిన విచిత్ర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో వెలుగుచూసింది. ప్రస్తుతం మార్కెట్‌లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ జరిగిన ఈ చోరీ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దమ్మపేటలోని సుభాని అనే వ్యక్తి చికెన్‌ షాపును నిర్వహిస్తున్నాడు. రోజూలాగే ఉదయాన్నే షాపు ఓపెన్‌ చేసి చికెన్‌ అమ్మకం మొదలు పెట్టాడు. ఉదయం 10 గంటల సమయంలో ఒక మహిళ, మరో వ్యక్తితో కలిసి చికెన్‌ దుకాణానికి వచ్చింది. రెండు కేజీల చికెన్ కావాలని రూ.500 ఇచ్చింది. యజమాని సుభాని చికెన్ కట్ చేసి కవర్‌లో పెడుతుండగా అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాంతో ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ హడావిడిలో పడ్డాడు. ఆ సమయంలో సదరు మహిళ తనకు ఇచ్చిన రెండు కేజీల చికెన్ కవర్‌తో పాటు, పక్కనే వేరే కస్టమర్ కోసం సిద్ధంగా ఉంచిన 10 కేజీల చికెన్ కవర్‌ను కూడా చాకచక్యంగా నొక్కేసి అక్కడి నుంచి జారుకుంది. కొద్దిసేపటి తర్వాత పక్కన పెట్టిన 10 కేజీల చికెన్ బ్యాగ్ కనిపించకపోవడంతో సుభాని కంగారుపడ్డాడు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, రెండు కేజీల చికెన్ కోసం వచ్చిన మహిళే ఆ పెద్ద కవర్‌ను ఎత్తుకెళ్లిన దృశ్యాలు బయటపడ్డాయి. బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చికెన్ కోసం సీసీ కెమెరా ఆధారాలతో పోలీసులను ఆశ్రయించడం చూసి స్థానికులు, పోలీసులు అవాక్కవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ గ్రామంలో వరుస మరణాలు.. భయంతో స్థానికులు ఏం చేశారంటే!

కోడలికి కొత్త జీవితం ఇచ్చిన మామ! నువ్వు సూపర్‌..

Follow Us