హార్ట్ సర్జన్‌కు గుండెపోటు.. ఆస్పత్రిలో రౌండ్స్ వేస్తుండగా..ఒక్కసారిగా
గుండెపోటు.. ఎప్పుడు ఎవర్ని ఎలా ఎటాక్ చేస్తుందో తెలియదు. కరోనా తర్వాత గుండెపోటు మహమ్మారిలా తయారైంది. వయసుతో సబంధం లేకుండా చిన్నారులనుంచి పెద్దవాళ్ల వరకూ అందరినీ పొట్టనపెట్టుకుంటుంది. చేతికందివచ్చిన కుమారుడు.. గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుకుంటున్న యువకుడు, క్లాసులో పాఠాలు వింటున్న చిన్నారి, పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కొందరు, చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకూ తమముందు ఆడుతూ పాడుతూ ఉన్నవారు క్షణాల్లో విగతజీవులుగా మారిపోతున్నారు.
ఇక తాజాగా ఈ గుండెపోటుకి కార్డియాక్ డాక్టరే బలైపోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటన అందరినీ కలచివేసింది. తమిళనాడుకు చెందిన 34 ఏళ్ళ డా.గ్రాడ్లిన్ రాయ్ కార్డియాక్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్ హాస్పిటల్‌లో రౌండ్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో రౌండ్స్‌లో ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. డాక్టర్‌ను కాపాడాలని తోటి వైద్యులు, సిబ్బంది ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ పలితం లేకపోయింది. గ్రాడ్లిన్ రాయ్ ప్రాణాలు కాపాడలేకపోయామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కార్డియాలజీపై అవగాహన ఉండి, అన్నిరకాల జాగ్రత్తలు తీసుకునే కార్డియాక్ సర్జన్ గుండెపోటుతో మృతి చెందడం ఆందోళనకరమైన విషయమని సహచర డాక్టర్ సుధీర్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాడ్లిన్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని ఆయన అన్నారు. తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలిక పని గంటలతో యువత ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఏఐతో ఓ యూజర్ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..
వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో
17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

