కొంపముంచిన పొగమంచు.. చెరువులోకి దూసుకెళ్లిన కారు

Updated on: Dec 28, 2023 | 10:15 PM

తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. పలు జిల్లాల్లో పొగమంచు కమ్మేస్తోంది. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో జనాలు ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. రహదారులు కనిపించక వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల ప్రమాదాలబారిన పడుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కొందర స్నేహితులు కారులో వెళ్తుండగా పొగమంచు కారణంగా దారి కనిపించక కారు చెరువులోకి దూసుకెళ్లిపోయింది.

తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. పలు జిల్లాల్లో పొగమంచు కమ్మేస్తోంది. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో జనాలు ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. రహదారులు కనిపించక వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల ప్రమాదాలబారిన పడుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కొందర స్నేహితులు కారులో వెళ్తుండగా పొగమంచు కారణంగా దారి కనిపించక కారు చెరువులోకి దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్ ను చూసేందుకు కారులో ఐదుగురు స్నేహితులు బయలుదేరారు. రఘు,మోహన్, సాగర్, గుణశేఖర్, పూజిత కారులో ఉన్నారు. వీకెండ్‌ కావడంతో అనంతగిరి హిల్స్ చూసేందుకు బయలుదేరిన వీరి కారు క్కసారిగా కారు చెరువులోకి దూసుకెళ్ళింది. రఘు కి ఈత రావడంతో సాగర్ మోహన్ పూజితలను ఒడ్డుకు చేర్చాడు. గుణశేఖర్ గల్లంతయ్యాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలయంలో అద్భుతం.. పడగవిప్పి నాట్యమాడిన త్రాచు

విద్యార్ధినిపై ప్రిన్సిపాల్‌ లైంగిక దాడికి యత్నం

రన్నింగ్‌లో ఉండగా ఊడిపోయిన పల్లెవెలుగు బస్సు టైర్లు

ఈ దొంగ రూటే సెపరేటు.. చోరీ చేసి మరీ దానాలు చేస్తాడు !!

Published on: Dec 28, 2023 10:15 PM
Loading...
Unable to load recommendations.
Follow Us