Viral Video: బెంగుళూరులో కుప్పకూలిన మూడంతస్తుల భవనం..  వీడియో

Viral Video: బెంగుళూరులో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. వీడియో

Phani CH

|

Updated on: Sep 29, 2021 | 10:12 PM

టెక్‌సిటీ బెంగళూర్‌లో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే ఈ భవనం నేల కూలింది. భవనం కూలుతున్న దృశ్యాలను స్థానికుల కెమెరాల్లో చిక్కింది.

టెక్‌సిటీ బెంగళూర్‌లో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే ఈ భవనం నేల కూలింది. భవనం కూలుతున్న దృశ్యాలను స్థానికుల కెమెరాల్లో చిక్కింది. ఈ ఘటన బెంగళూర్‌ లోని విల్సన్‌ గార్డెన్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. భవనం కూలడానికి ముందే జనాన్ని అక్కడి నుంచి అధికారులు ఖాళీ చేయించారు. దీంతో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని సమీక్షించి.. సహాయక చర్యలు చేపట్టారు..గత మూడు రోజులుగా ఈ భవనం కుంగిపోతున్నట్లు అధికారులు ముందే గుర్తించారు. దీంతో ఆ భవనంలో ఉన్న వాళ్లను మూడు రోజుల క్రితమే అక్కడి నుంచి మరో భవనంలోకి మార్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు అధికారులు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అద్దెకు గర్ల్ ఫ్రెండ్.. లక్షల్లో ఖర్చు చేస్తున్న యువత! వీడియో

తల్లికాబోయే వారు జంక్‌ ఫుడ్‌ తింటే జరిగేది ఇదే! వీడియో