Love proposal: ఓ పక్క ప్రేయసి తండ్రికి అంత్యక్రియలు జరుగుతుంటే.. ఆ ప్రియుడు ఏంచేశాడో చూడండి..
అమ్మాయికానీ, అబ్బాయికానీ తమ ప్రేమను ఒకరికొకరు చెప్పుకునే విషయంలో చాలా సంకోచిస్తారు. ప్రేమిస్తున్న విషయం అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ చెప్పినప్పుడు అంగీకరిస్తారా లేదా అని భయపడుతుంటారు.
అమ్మాయికానీ, అబ్బాయికానీ తమ ప్రేమను ఒకరికొకరు చెప్పుకునే విషయంలో చాలా సంకోచిస్తారు. ప్రేమిస్తున్న విషయం అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ చెప్పినప్పుడు అంగీకరిస్తారా లేదా అని భయపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు మంచి సమయం, సందర్భం చూసి చెబితే, మరికొందరు అందమైన బహుమతులు ఇచ్చి లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. అయితే దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి ఎలాంటి సెంటిమెంట్లకు, భయాలతకు తావు లేకుండా ఎంతో ధైర్యంగా తన లవ్ ప్రపోజల్‌ను ప్రియురాలిముందుంచాడు. అది చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. వీడెవడండీ బాబు.. సమయం, సందర్భం ఉండక్కర్లా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ తన తండ్రి అంత్యక్రియల కోసం స్మశానానికి వెళ్లింది. విషాదంలో ఉన్న ఆమె వద్దకు చర్చిలో పని చేస్తున్న పాస్టర్ వచ్చాడు. ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చుని.. `పెళ్లి చేసుకుంటావా` అని అడిగాడు. ఆమె చేతికి ఉంగరాన్ని కూడా తొడిగాడు. ఆమె ఆ సమయంలో తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది. మొజెలా అనే యువతి ఆ వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆ వ్యక్తి చేసిన పనికి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..
Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!