Two Rupees Biryani: రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!

|

Aug 11, 2024 | 10:10 PM

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ రెస్టారెంట్ నిర్వహకుడు కళ్ళు చేదిగిపోయే బంపర్ ఆఫర్ పెట్టాడు. ఆ ఆఫర్ విన్న వాళ్లంతా లొట్టలేసుకుంటూ మరి రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు.. కానీ అక్కడ షరతులు వర్తిస్తాయి అనే విధంగా ఆఫర్ కొంతమందికి మాత్రమే ఉండడంతో మిగిలిన వారు నిరాశతో వెనుతిరిగారు.. తాడేపల్లిగూడెం ఉషా గ్రాండ్ వద్ద నూతనంగా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ రెస్టారెంట్ నిర్వహకుడు కళ్ళు చేదిగిపోయే బంపర్ ఆఫర్ పెట్టాడు. ఆ ఆఫర్ విన్న వాళ్లంతా లొట్టలేసుకుంటూ మరి రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు… కానీ అక్కడ షరతులు వర్తిస్తాయి అనే విధంగా ఆఫర్ కొంతమందికి మాత్రమే ఉండడంతో మిగిలిన వారు నిరాశతో వెనుతిరిగారు.. తాడేపల్లిగూడెం ఉషా గ్రాండ్ వద్ద నూతనంగా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా కేవలం 2 రూపాయలకే బిర్యానీ అంటూ రెస్టారెంట్ నిర్వాహకుడు ఆఫర్ ప్రకటించాడు. అది విన్న తాడేపల్లిగూడెం ప్రజలు బిర్యానీ కోసం ఎగబడ్డారు.

ఇంకేముంది రెస్టారెంట్ ముందు ఇసుక వేస్తే రాలనంత జనం. రెండు రూపాయల బిరియాని కోసం వేలాది మంది జనం అక్కడికి చేరుకున్నారు. అయితే రెస్టారెంట్ నిర్వాహకుడు ఇచ్చిన ట్విస్ట్‌కి కస్టమర్లకు దిమ్మదిరిగింది. అతను కేవలం 200 ప్యాకెట్ల వరకూ మాత్రమే రెండు రూపాయలు వర్తిస్తుందని చెప్పడంతో బిర్యానీ ప్రాకెట్ల కోసం పోటీ పడ్డారు జనం. దొరికినవాళ్లు హ్యాపీగా బిర్యానీ ప్యాకెట్‌తో వెళ్లారు. దొరకని వాళ్లు ఉసూరుమంటూ టైం వేస్ట్‌ అనుకుంటూ నిరాశతో వెనుదిరిగారు. బిర్యానీ కోసం వచ్చిన జనంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేసి సమస్యను పరిష్కరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on