టాయిలెట్ కోసం బ్రేక్ ఇవ్వలేదని దారుణ హత్య.. షాకింగ్ నిజం చెప్పిన డ్రైవర్
బీహార్‌లో సాసారం మున్సిపల్ కౌన్సిల్ ఈవో విమల్ కుమార్ హత్య కేసు సంచలనంగా మారింది. టాయిలెట్ కోసం కారు ఆపకపోవడంతో వాగ్వాదం జరిగి, కోపంతో ఇనుప రాడ్‌తో హత్య చేసినట్లు డ్రైవర్ మిథిలేష్ కుమార్ ఒప్పుకున్నాడు. ఇదే కేసులో ఎల్జేపీ ఎమ్మెల్యే రాజీవ్ రంజన్ సింగ్‌పై మృతుడి భార్య తీవ్ర ఆరోపణలు చేయగా, ఆయన వాటిని ఖండించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బీహార్‌లో దారుణం జరిగింది. సాసారం మున్సిపల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విమల్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి పట్నా వెళ్తుండగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈవోను ఆయన డ్రైవర్ మిథిలేష్ కుమారే ఇనుప రాడ్‌తో కొట్టి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో డ్రైవర్ మిథిలేష్ సంచలన విషయాలు వెల్లడించాడు. ప్రయాణంలో టాయిలెట్ కోసం కారు ఆపాలని అడిగానని, ఈవో ఒప్పుకోకపోవడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపాడు. అధికారి ప్రవర్తన, పని ఒత్తిడితో సహనం కోల్పోయి కారులోని ఇనుప రాడ్‌తో దాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మొదట గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని నాటకమాడినప్పటికీ, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం ఒప్పుకున్నాడు. మరోవైపు ఈ హత్య కేసులో స్థానిక ఎల్జేపీ ఎమ్మెల్యే రాజీవ్ రంజన్ సింగ్ హస్తం ఉందని మృతుడి భార్య బబిత ఆరోపించడం సంచలనంగా మారింది. రూ.50 లక్షలు, ఆ తర్వాత రూ. 25 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే తన భర్తను వేధించారని, డబ్బు ఇవ్వనందుకే హత్య చేయించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను ఎమ్మెల్యే సోను సింగ్ ఖండించారు. తనపై రాజకీయ దురుద్దేశంతోనే నిందలు వేస్తున్నారని, విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్ కోసం గాలిస్తున్నామని, ఆధారాల సేకరించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని మగధ్ రేంజ్ ఐజీ వికాస్ వైభవ్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో మహిళలకు ఫ్రీగా లక్ష పట్టుచీరలు! ఊరూరూ తిరిగి పంచుతున్న బీజేపీ నేత
