Viral Video: మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళ.. వెనక నుంచి వచ్చిన ఓ వ్యక్తి..
బెంగళూరులో శుక్రవారం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ మహిళపై అత్యాచారయత్నం జరిగింది జరిగింది. తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కేసు నమోదు చేసుకున్న బెంగళూరు సౌత్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తుండగా.. ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దుండగుడి నుంచి తప్పించుకుని మహిళ పరుగులు తీసింది. ఆమెను కొంత దూరం ఫాలో అయిన ఆ వ్యక్తి తిరిగి వెనక్కి వచ్చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్‌లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.