జస్ట్ 30 నిమిషాల్లో.. 12 కి.మీ జర్నీ హైదరాబాద్ స్పీడ్‌కు బెంగళూరు టెకీ ఫిదా..

Updated on: May 16, 2026 | 1:29 PM

హైదరాబాద్ రోడ్ల మౌలిక సదుపాయాలను చూసి బెంగళూరుకు చెందిన ఓ టెక్కీ ఆశ్చర్యం వ్యక్తం చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం 30 నిమిషాల్లో 12 కిలోమీటర్లు ప్రయాణించానని, బెంగళూరులో అయితే అంత సమయం లో కిలోమీటర్ కూడా కష్టమేనని పేర్కొన్నాడు. దీంతో రెండు ఐటీ నగరాల ట్రాఫిక్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ మొదలైంది.

సాఫ్ట్‌వేర్ హబ్‌లుగా పేరున్న హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య పోలిక ఈనాటిది కాదు. ఐటీ కంపెనీలు, జీవన ప్రమాణాలు, వాతావరణం.. ఇలా ప్రతి విషయంలోనూ ఈ రెండు నగరాల మధ్య పోటీ ఉంటుంది. అయితే తాజాగా ట్రాఫిక్ విషయంలో ఈ రెండు నగరాల మధ్య జరిగిన ఒక ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ రోడ్ల మౌలిక సదుపాయాలను చూసి ఓ బెంగళూరు వ్యక్తి ఆశ్చర్యపోతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరుకు చెందిన ఆర్చీ సేన్‌గుప్తా ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ తన ప్రయాణ అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ లో పంచుకున్నారు. తను ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నాననీ కేవలం 30 నిమిషాల్లో 12 కిలోమీటర్లు ప్రయాణించాననీ బెంగళూరులో 30 నిమిషాలకు మహా అయితే ఒక కిలోమీటర్ వెళ్లగలమనీ హైదరాబాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిజంగా అద్భుతంగా ఉందని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఐటీ హబ్‌ల మధ్య ఎప్పుడూ ఉండే పోరులో ఈసారి హైదరాబాద్ పైచేయి సాధించింది. 12 కిలోమీటర్ల దూరాన్ని కేవలం అరగంటలో చేరుకోవడం చూసి ఆ బెంగళూరు వ్యక్తి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నా బెంగళూరు మెదడుకు ఇది అస్సలు అర్థం కావడం లేదంటూ అతను పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే 43,000కు పైగా వ్యూస్, వందలాది కామెంట్లతో నెట్టింట జోరుగా చర్చ నడిచింది. చాలా మంది నెటిజన్లు ఆర్చీ అభిప్రాయంతో ఏకీభవించారు. హైదరాబాద్‌లోని విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్ ప్రయాణ సమయాన్ని బాగా తగ్గించాయని కామెంట్లు చేశారు. ఒక యూజర్ తను ఆఫీస్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే 50 కి.మీ. దూరాన్ని 45-55 నిమిషాల్లో చేరుకుంటానని చెప్పగా, బెంగళూరు ట్రాఫిక్ వల్ల 5 కి.మీ. ప్రయాణం కూడా చాలా పెద్ద దూరంగా అనిపిస్తుంది అని మరొకరు వ్యాఖ్యానించాడు. కొందరు మాత్రం హైదరాబాద్‌లోనూ పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, బహుశా అతను ఆదివారం ప్రయాణించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. “హైదరాబాద్ ఇంకా బెంగళూరు స్థాయికి పడిపోలేదు, కానీ త్వరలోనే ఆ పరిస్థితి రావచ్చు అని ఒకరు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని విశాలమైన రోడ్లు, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కింద నిర్మించిన ఫ్లైఓవర్లు, మల్టీ లెవల్ గ్రేడ్ సెపరేటర్లు, ఔటర్ రింగ్ రోడ్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేశాయని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మొత్తానికి బెంగళూరు టెక్కీ చేసిన ఈ పోస్ట్ రెండు నగరాల మౌలిక సదుపాయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరోసారి ఎత్తిచూపింది. హైదరాబాద్ ప్రణాళికాబద్ధంగా దూసుకుపోతుంటే, బెంగళూరు తన పాత ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడటానికి ఇంకా కష్టపడుతూనే ఉంది.బెంగళూరు ట్రాఫిక్‌తో పోలిస్తే హైదరాబాద్ ప్రయాణం ఎంతో సాఫీగా ఉందన్న పోస్ట్, రెండు ప్రధాన నగరాల మధ్య మౌలిక వసతులు, ట్రాఫిక్ నిర్వహణపై చర్చకు తెరలేపింది

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏడాదికి 50 లక్షల జీతం.. 10 వేల ఫోన్.. ఆటోలో ఆఫీసుకు.. ఈ ఐటీ ఉద్యోగిని కథ వైరల్

ఫ్రిజ్‌లో కూరగాయలు కుళ్ళిపోతున్నాయా ?? అద్భుతమైన చిట్కా మీకోసం

హైవేపై మహిళ బైక్ కు పంక్చర్.. సాయం చేసేందుకు పోటీపడిన యువకులు

వెయ్యేళ్ల నాటి నిధి లభ్యం.. అంతా స్వచ్ఛమైన బంగారమే

నా శవాన్ని అమ్మానాన్నలకు చూపించొద్దు.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్

Follow Us