చెత్త ఏరుకునే వ్యక్తికి దొరికిన బ్యాగ్‌ !! తెరిచి చూడగా 30 లక్షల డాలర్లు

|

Nov 09, 2023 | 8:44 PM

బెంగళూరులో చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తికి ఒక బ్యాగు దొరికింది. అందులో 30 లక్షల అమెరికన్‌ డాలర్ల కట్టలున్నాయి. భారత కరెన్సీలో వాటి విలువ సుమారు రూ.25 కోట్లు. ఈ నెల 3న బెంగళూరు నాగవార రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాల పక్కన ఎస్‌కే సాల్మన్‌ చెత్త సేకరిస్తుండగా ఓ బ్యాగు దొరికింది. దానిపై యునైటెడ్‌ నేషన్స్‌ అనే ముద్ర ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని నాడియాకు చెందిన ఎస్‌కే సాల్మన్‌ బెంగళూరులో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

బెంగళూరులో చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తికి ఒక బ్యాగు దొరికింది. అందులో 30 లక్షల అమెరికన్‌ డాలర్ల కట్టలున్నాయి. భారత కరెన్సీలో వాటి విలువ సుమారు రూ.25 కోట్లు. ఈ నెల 3న బెంగళూరు నాగవార రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాల పక్కన ఎస్‌కే సాల్మన్‌ చెత్త సేకరిస్తుండగా ఓ బ్యాగు దొరికింది. దానిపై యునైటెడ్‌ నేషన్స్‌ అనే ముద్ర ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని నాడియాకు చెందిన ఎస్‌కే సాల్మన్‌ బెంగళూరులో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సంచిని అమృతహళ్లిలోని ఇంటికి తీసుకెళ్లి తెరిచి చూడగా 23 బండిళ్ల డాలర్లు కనిపించాయి. ఏం చేయాలో తెలియక రెండురోజుల తర్వాత స్వరాజ్‌ ఇండియా సామాజిక కార్యకర్త ఆర్‌.కలీముల్లాను కలిసి విషయం చెప్పాడు. కలీముల్లా ఈ సంగతిని నగర పోలీస్‌ కమిషనర్‌ దయానందకు తెలిపారు. ఆయన సూచనతో సాల్మన్‌ను, నగదును తీసుకుని కమిషనర్‌ ఆఫీసుకు వెళ్లారు. మరోవైపు నగదు దొరికిన ప్రదేశంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ డాలర్లు నకిలీవని భావిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar: దిమ్మతిరిగే అప్డేట్.. సలార్ ట్రైలర్ వచ్చేస్తోంది..

Salaar: OTT కింగ్‌ ప్రభాసే !! లేకుంటే.. అన్ని కోట్లు డీల్ ఏంది సామి !!

రష్మిక మార్ఫింగ్ వీడియో.. ఒరిజినల్ క్లిప్ లో ఉన్నది ఈ అమ్మాయే !!

TOP 9 ET News: అది సాంగ్ అంటే.. దెబ్బకు బాక్సులు బద్దలవ్వాలే.. తండ్రి కాబోతున్న శర్వానంద్ ??

మెగా కోడలి సంస్కారానికి.. మెగాస్టార్ మొఖంలో వెల్లివిరిసిన సంతోషం

Follow us on