Viral: ఆపరేషన్ సక్సెస్.. తెగిపడిన మర్మాంగాన్ని అతికించిన బెంగళూరు వైద్యులు

| Edited By: Ravi Kiran

Jan 16, 2023 | 9:00 AM

మారుతున్న కాలానికి అనుగుణంగా.. వృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని వైద్యరంగం మరో ముందడుగు వేసింది. కర్ణాటకలో డాక్టర్లు మరో అద్భుత విజయం సాధించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా.. వృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని వైద్యరంగం మరో ముందడుగు వేసింది. కర్ణాటకలో డాక్టర్లు మరో అద్భుత విజయం సాధించారు. నైజీరియాలో ఆరు నెలల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 12 సంవత్సరాల బాలుడి మర్మాంగం పూర్తిగా తెగిపోయింది. తెగిపడిన మర్మాంగాన్ని ప్రత్యేక శస్త్ర చికిత్సతో బెంగళూరులోని ఫోర్టీస్‌ ఆసుపత్రిలో తిరిగి అతికించారు. యూరో ఆంకాలజీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ మోహన్‌ కేశవమూర్తి ఈ అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. రెండు దశల శస్త్ర చికిత్స అనంతరం మూత్ర విసర్జనకు సమస్య లేకుండా చేశామని, మూడో దశలో మూత్రనాళాలను ఏర్పాటు చేయాల్సి ఉందని డాక్టర్ మోహన్ కేశవమూర్తి తెలిపారు. ఆరు నెలల అనంతరం ఇతడికి మరో శస్త్రచికిత్స చేస్తామన్నారు. బాలుడు పెరిగి పెద్దవాడయ్యాక వైవాహిక జీవితం గడిపేందుకు ఎలాంటి సమస్య ఉండదని వైద్యులు స్పష్టం చేశారు

Also Watch:

బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌ !!

ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు

50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!

చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!

మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??

Follow us on