Bamma dance: అమ్మ బామ్మా.. ఇంకా నీలో స్పీడు తగ్గలేదు.. థియేటర్‌లో బామ్మ హుషారైన స్టెప్పులు వైరల్..

|

Jan 26, 2023 | 8:59 AM

రంజితమే.. రంజితమే.. గత కొన్నిరోజులుగా సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న పాట ఇది. కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన వారిసు సినిమాలోని ఈ పాట యూట్యూబ్‌ రికార్డులను కొల్లగొడుతోంది.


రంజితమే.. రంజితమే.. గత కొన్నిరోజులుగా సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న పాట ఇది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ రంజితమే పాటకు స్టెప్పులేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఓ క్రేజీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. థియేటర్లో వారిసు సినిమా చూస్తూ రంజితమే పాట రాగానే ఓ బామ్మ స్క్రీన్‌ దగ్గరకు పరుగెత్తి డాన్స్‌ చేసింది. హుషారైన స్టెప్పుల‌తో బామ్మ డాన్స్‌ చేస్తుంటే మిగతా ప్రేక్షకులు చూస్తూ ఉండలేకపోయారు. బామ్మతో పాటు ప‌లువురు త‌మ సీట్లలో నుంచి లేచి క్రేజీ స్టెప్స్‌తో థియేట‌ర్‌లో హంగామా సృష్టించారు. ఈ వీడియోను నిజాముద్దీన్‌ అనే యూజర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. రంజిత‌మే పాటకు థియేటర్‌లో హోరెత్తించిన బామ్మ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. బామ్మ ఎనర్జిటిక్‌ మూమెంట్స్‌కు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. పండగవేళ హీరో విజ‌య్‌కి పెద్ద గిఫ్ట్‌ ఇదేనని, ఆయ‌న‌ను ఆరు నుంచి అర‌వై ఏళ్ల వ‌య‌సు వ‌ర‌కూ అంద‌రూ ఆరాధిస్తార‌ని ఓ యూజ‌ర్ రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

UK’s PM office Pongal: వాహ్వా..! యూకే ప్రధాని కార్యాలయంలో పొంగల్ విందు భోజనాలు..! ఖండాలు దాటినా తెలుగు సంప్రదాయం..

Wife Murder: వీడేం మొగుడు.. భార్య అందంగా ఉందని చంపేసిన భర్త.. పెళ్లైన ఆరు నెలలకే..!

TOP 9 ET News: NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే! | డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా.!

Published on: Jan 26, 2023 08:59 AM