ఏం ఐడియా బాస్‌.. ఇది ఇండియా దాటకూడదంతే..

Updated on: Apr 12, 2023 | 9:32 AM

సోషల్ మీడియాలో చాలా ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా ఉంటే..మరికొన్ని వీడియోలు ఔరా అనేట్టుగా ఉంటాయి.

సోషల్ మీడియాలో చాలా ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా ఉంటే..మరికొన్ని వీడియోలు ఔరా అనేట్టుగా ఉంటాయి. ఇందులో దేశీ జుగాడ్‌లకు సంబంధించినవైతే మరింత ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటివి భారతీయులకే సాధ్యమనిపిస్తాయి. తాజాగా ఓ వ్యక్తి తెలివితేటలకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇసుమంతకూడా కష్టపడకుండా చేతిపంపునుంచి నీళ్లు నింపుతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా చేతితో పంపింగ్ చేస్తే బోరులోని నీరు పైకి వస్తుంది. ఒకే సమయంలో ఓ 10 బకెట్లు నీళ్లు కొట్టాలంటే చాలా కష్టం. దాంతో ఓ వ్యక్తి సూపర్‌ ఐడియా చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దేశీ చేతి పంపును ఆటోమేటిక్ హ్యాండ్ పంప్‌గా మార్చేశాడు. చేతిపంపు పక్కనే ఓ దిమ్మలాంటిది ఉంది. దానికి రెండు చక్రాలను అమర్చాడు. వాటికి సైకిల్‌ చైను అమర్చాడు. ఆ చక్రానికి సైకిల్‌ పెడల్‌ను హ్యాండిల్‌గా అమర్చాడు. దానికి ఓ వెదురు కర్రను అమర్చి దానిని పంప్‌ హ్యాండిల్‌కి కట్టాడు. వీటన్నిటికి కరెంట్‌ వైర్లతో కనెక్షన్‌ ఇచ్చి చక్రం ఆటోమేటిక్‌గా తిరిగేలా చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీ-ష‌ర్ట్‌ను ఎలా మ‌డ‌త పెట్టిందో చూస్తే.. వావ్ అనాల్సిందే

Published on: Apr 12, 2023 09:32 AM
Loading...
Unable to load recommendations.
Follow Us