సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. ఇంటర్ బోర్డుకు విద్యార్థి ఫోన్ కాల్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల ముందు ఓ విద్యార్థి ఇంటర్ బోర్డు అధికారులకు ఫోన్ చేసి తనను పాస్ చేయమని వేడుకున్నాడు. పరీక్షలో సరిగా రాయలేదని, ఆన్సర్ షీట్లలో డబ్బులు కూడా పెట్టానని అంగీకరించాడు. అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వగా, ఫలితాల్లో అతడు తప్పాడు. ఈ వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల వేళ ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫలితాలు వెలువడక ముందే తనను ఎలాగైనా పాస్ చేయాలంటూ విశాఖపట్నానికి చెందిన ఓ విద్యార్థి నేరుగా ఇంటర్ బోర్డు అధికారులకే ఫోన్ చేసి వేడుకున్నాడు. తాను పరీక్షలు సరిగ్గా రాయలేదని, ఫెయిల్ అవుతాననే భయంతో బుధవారం ఆ విద్యార్థి అధికారులకు ఫోన్ చేశాడు. ఆన్సర్ షీట్ల మధ్య డబ్బులు కూడా పెట్టానని, వాటిని చూసైనా తనను పాస్ చేయాలని కోరడం గమనార్హం. పరీక్షలో ఏమీ చదవకపోవడం వల్ల ఏమీ రాయలేకపోయానని, అందుకే ఇచ్చిన ప్రశ్నాపత్రాన్నే మూడు సార్లు సమాధాన పత్రంలో రాశానని ఆ విద్యార్థి అధికారులతో నిజాయతీగా ఒప్పుకున్నాడు. విద్యార్థి మాటలు విని ఆశ్చర్యపోయిన బోర్డు అధికారులు, అతనికి ధైర్యం చెప్పారు. ఇలాంటి పనులు చేయవద్దని, త్వరలోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని, ఈసారి బాగా చదువుకుని పరీక్ష రాయాలని ఫోన్‌లోనే కౌన్సెలింగ్ ఇచ్చారు. గురువారం విడుదలైన ఫలితాల్లో విద్యార్థి అనకున్నట్లుగానే ఫెయిల్ అయ్యాడు. అతడు ఫస్టియర్‌లో రెండు సబ్జెక్టులు, సెకండియర్‌లో మూడు సబ్జెక్టులు తప్పినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ??
మహిమల చెంబు.. మీ ఇంట ఉంటే సిరుల పంటే.. ఆలసించిన ఆశాభంగం
వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా
ప్రొజెక్టర్ రూమ్‌లో చనిపోతే.. దొంగచాటుగా పుట్‌పాత్‌పై పడేస్తారా ??
