డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు

Updated on: May 15, 2026 | 12:34 PM

డైనోసార్ల కంటే కోట్ల ఏళ్ల ముందే భూమిపై సంచరించిన భారీ మిలిపీడ్ ‘ఆర్థ్రోప్లూరా’ శిలాజాన్ని శాస్త్రవేత్తలు ఇంగ్లండ్‌లో గుర్తించారు. కారు సైజులో ఉండే ఈ జీవి 32 కోట్ల సంవత్సరాల నాటిదిగా చెబుతున్నారు. ఇదే సమయంలో హార్స్‌షూ క్రాబ్స్, సీలకాంత్ చేపలు, అలిగేటర్లు, కొమొడో డ్రాగన్స్ వంటి కొన్ని జీవులు కోట్లాది ఏళ్ల మార్పులను తట్టుకుని ఇప్పటికీ జీవించి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

డైనోసార్లు భూమిపైకి రాకముందే, వాటికంటే దాదాపు 10 కోట్ల సంవత్సరాల ముందే భూమిపై ఒక రాక్షస జీవి తిరిగేది. దాదాపు కారు సైజులో ఉండే జెర్రి వంటి భారీ సైజ్‌ మిలిపీడ్ (arthoplura) ఆర్థ్రోప్లూరా. శాస్త్రవేత్తలు తాజాగా ఇంగ్లండ్‌లోని హౌయిక్ బేలో 32 కోట్ల సంవత్సరాల నాటి ఆ జీవి శిలాజాన్ని కనుగొన్నారు. ఒక ఇసుకరాతిలో దాని కవచ భాగాన్ని గుర్తించారు. ఇప్పటివరకు ఆర్థ్రోప్లూరాకు సంబంధించి దొరికిన మూడో శిలాజం ఇది. ఉన్నవాటన్నింటిలో ఇదే అతి పెద్దది, అత్యంత పురాతనమైంది కూడా. ఇవి సుమారు 4.5 కోట్ల సంవత్సరాల పాటు భూమిపై ఉండి అంతరించిపోయాయట. ప్రిహిస్టోరిక్ కాలం అంటే మనకు డైనోసార్లు లేదా మ్యూజియంలో ఉండే శిలాజాలే గుర్తొస్తాయి కానీ ఆశ్చర్యంగా, కోట్లాది ఏళ్ల క్రితం నాటి కొన్ని జీవులు ఇప్పటికీ మన మధ్యే తిరుగుతున్నాయి. ఐస్ ఏజ్ వచ్చినా, భూమి మీద ఎన్నో మార్పులు జరిగినా అవి మాత్రం ఏమాత్రం మారకుండా అలాగే సర్వైవ్ అయ్యాయి. మొదటిది సముద్ర తీరాల్లో కనిపించే హార్స్‌షూ క్రాబ్స్ భూమ్మీదున్న అత్యంత పురాతన జీవుల్లో ఇదొకటి. ఇవి 450 మిలియన్ ఏళ్ల క్రితం నుంచే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే డైనోసార్లు పుట్టకముందే ఇవి పుట్టాయి. వింతేమిటంటే, కోట్లాది ఏళ్లు గడిచినా వీటి షేప్, స్ట్రక్చర్ , బిహేవియర్ ఏమాత్రం మారలేదు. అందుకే వీటిని “లివింగ్ ఫాసిల్స్” అని పిలుస్తారు. ఇండోనేషియాలో కనిపించే కొమొడో డ్రాగన్స్‌ను చూస్తుంటే మనకు పాత కాలం నాటి రాక్షస బల్లులు గుర్తొస్తాయి. వీటి మూలాలు మిలియన్ల ఏళ్ల నాటివి. అవి వేటాడే పద్ధతి కూడా చాలా పురాతనంగా, కాలిక్యులేటెడ్‌గా ఉంటుంది. చాలా కాలం వరకు శాస్త్రవేత్తలు సీలకాంత్ చేపలు డైనోసార్లతో పాటే అంతరించిపోయాయని అనుకున్నారు. కానీ 1938లో ఒక చేప సజీవంగా దొరకడంతో ప్రపంచం మొత్తం షాకైంది. సముద్రం లోతుల్లో ఉండే ఆ చేప రెక్కలు కాళ్లలాగా కనిపిస్తాయి. అంతరించిపోయిందనుకున్న జీవి మళ్ళీ కనిపించడం అంటే నిజంగా గ్రేట్ కదూ. అలిగేటర్లు దాదాపు 150 మిలియన్ ఏళ్ల నుంచి భూమి మీద ఉన్నాయి. డైనోసార్ల కాలంలో అవి ఎలా ఉండేవో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. వీటి బాడీ స్ట్రక్చర్ , నీటిలో వేటాడే స్టైల్ కోట్లాది ఏళ్ల నుంచి మారలేదు. కాలానికి తగ్గట్టుగా మారాల్సిన అవసరం లేకుండానే ఇవి సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి అంటే వీటి డిజైన్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈదురు గాలుల ధాటికి.. 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డ వ్యక్తి!

Air India: విమాన ప్రయాణికులకు షాక్‌.. 1,200 విమానాలు రద్దు

ఇంట్లో బంగారం దాచుకున్న వారికి బంపర్ ఆఫర్.. 10 గ్రాములున్నా లాభమే

ఆర్థిక సంక్షోభం దిశగా ప్రపంచం.. ఉప్పు నుండి ఉక్కు వరకు రేట్లు డబుల్

Follow Us