ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!
మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తమ భక్తిని విభిన్న రీతుల్లో చాటుకుంటున్నారు. కళాకారులు సైతం తమ కళ ద్వారా దైవాన్ని ఆవిష్కరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తికి చెందిన ప్రముఖ సైకత శిల్పి దేవినేని శ్రీనివాస్ 3 యూనిట్ల ఇసుకతో, 15 అడుగుల వెడల్పున శివపార్వతుల అద్భుత సైకత శిల్పాన్ని రూపొందించి భక్తులను మంత్రముగ్దులను చేశారు. ఇది పర్వదినానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తమదైనశైలిలో భక్తిని చాటుకుంటున్నారు. ఈ పర్వదినం రోజున భక్తులు ఉదయాన్నే శైవక్షేత్రాలకువెళ్లి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. పూజలు చేస్తారు. అయితే కళాకారులకు తమ కళే దైవం. కళలోనే దైవాన్ని చూస్తారు..చూపిస్తారు కూడా. అలా తమ భక్తిని చాటుకుంటారు. ఇందులో భాగంగా ఒకరు చాక్‌పీస్‌పై సూక్ష్మ శివలింగాన్ని చెక్కితే.. మరో కళాకారుడు ఆ ఆదిదంపతులను సైకత శిల్పంగా రూపొందించి ఆకట్టుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవినేని శ్రీనివాస్ రూపొందించిన శివపార్వతుల సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. గత దశాబ్ద కాలంగా ప్రజలను చైతన్యవంతులను చేసే సైకత శిల్పాలను రూపొందిస్తున్న దేవినేని శివరాత్రి పర్వదినాన…సుమారు 3 యూనిట్ల ఇసుకతో, 15 అడుగుల వెడల్పున అత్యంత మనోహరంగా తీర్చిదిద్దిన ఈ శిల్పం భక్తులను మంత్రముగ్దులను చేస్తోంది. ఆది దంపతులను కనులారా చూసి తరించేలా రూపొందించిన ఈ కళాఖండం చూపరులను ఆకట్టుకుంటోంది. దీనిపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్!
గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము: చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే
నీళ్లా.. అని లైట్ తీసుకోకండి.. విషయం తెలిస్తే షాకే
