అనంతపురంలో సిమ్లా యాపిల్స్ సాగు.. ఇదిగో ఇలా..

Updated on: Apr 14, 2026 | 1:45 PM

యాపిల్ పండు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది హిమగిరులతో విరాజిల్లే కాశ్మీర్ లేదా చల్ల చల్లని సిమ్లా. అంతటి చల్లని ప్రదేశంలో పండే యాపిల్‌ పండ్లకు ఉంటే డిమాండ్‌ వేరే లెవల్లో ఉంటుంది. అందుకే వాటికి కాశ్మీర్‌ యాపిల్‌, సిమ్లా యాపిల్‌ అని ప్రత్యేకంగా పిలుస్తారు. మరి అంతటి ప్రత్యేకమైన యాపిల్‌ పండ్లు ఆంధ్రప్రదేశ్‌లో పండితే.. మీరు విన్నది నిజమే. ఏపీలోని అనంతపురం జిల్లాలో సిమ్లా యాపిల్స్‌ సాగుచేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు మార్తాడు గ్రామానికి చెందిన రైతు కృష్ణారెడ్డి.

40 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలు, తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడే అనంత నేలలో యాపిల్ సాగు సాధ్యమేనా? అని అందరూ ఆశ్చర్యపోతుంటే.. ‘అవును సాధ్యమే’ అని నిరూపించారు. కృష్ణారెడ్డి. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన కృష్ణారెడ్డి, ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకమైన యాపిల్ మొక్కలను తెప్పించి తన 15 ఎకరాల్లో సాగు చేపట్టారు. సాధారణంగా యాపిల్ సాగుకు చల్లటి వాతావరణం కావాలి. కానీ, అనంతలో ఉండే ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ఆయన స్ప్రింక్లర్స్‌ (Sprinklers) ద్వారా మొక్కలపై నిరంతరం నీటిని చిలకరిస్తూ చల్లటి వాతావరణాన్ని సృష్టించారు. అలాగే డ్రిప్ (Drip) పద్ధతిలో మొక్కకు సరిపడా నీటిని అందిస్తూ అద్భుత ఫలితాలు సాధించారు. కృష్ణారెడ్డి సాగు చేసిన ఈ తోటలో యాపిల్స్ ఏపుగా పెరిగి అద్భుతమైన దిగుబడిని ఇచ్చాయి. ఎకరాకు సుమారు టన్ను యాపిల్స్ దిగుబడి వస్తుండగా, మార్కెట్‌లో వీటికి మంచి ధర పలుకుతోంది. ప్రస్తుతం టన్ను ధర సుమారు 1,50,000 రూపాయల వరకు ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

ఆహా అనిపిస్తున్న పోచమ్మ ట్రైలర్‌!

ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. కొత్త లుక్‌తో తారక్ సర్‌ప్రైజ్

షారుఖ్‌ ప్లేస్‌ని రణ్‌వీర్‌ కొట్టేస్తారా?

కోలీవుడ్‌లో సీక్వెల్స్‌ జోరు

Follow Us