ఆర్నాల్డ్ స్వార్జ్నెగ్గర్పై ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ తాజాగా వైరల్‌గా మారింది. ఓ ఊళ్ళో గోడపై ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ బాడీ బిల్డింగ్ ఫొటో వేశారు. దానిపక్కనే ఆర్నాల్డ్ సుభాష్‌నగర్ అని రాసి ఉంది. ఇది చూసి ఆనంద్ మహీంద్ర ఆశ్చర్యపోయారు. ఆ ఫొటోను ఆనంద్ మహీంద్ర ట్విటర్లో పోస్ట్ చేసి ఫన్నీ కామెంట్ జత చేశారు. ‘ఇది భారతీయుల గొప్పతనం.. మనం దేన్నైనా, ఎవరినైనా దత్తత తీసుకుంటాం..మన నేటివిటీకి తగ్గట్లు మార్చేసుకుంటాం..ఇకపై నేను ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ అని పిలిచేందుకు కష్టపడక్కర్లేదు.. ఆర్నాల్డ్ సుభాష్‌నగర్ అని పిలవొచ్చు.’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. చాలామంది తమకు పలకడం రాని పేర్లను మార్చి ఎలా పలుకుతున్నామో కామెంట్లలో చెప్పారు. కర్నాటకలోని మా ఊళ్ళోనైతే ఆర్నాల్డ్ శివాజీనగర్ అని పిలుస్తారంటూ ఓ యూజర్ కామెంట్ యాడ్ చేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..