Pawan kalyan fan: ఇదెక్కడి పిచ్చిరా బాబు..! పవన్ పైకి అమాంతంగా దూకిన అభిమాని.. ట్రెండ్ అవుతున్న వీడియో.
పవన్ కళ్యాణ్ అంటే.. ఓ వ్యసనం అని బండ్ల ఏ క్షణాన అన్నారో తెలియదు కాని.. నిజంగానే ఆయన తన అభిమానులకు ఓ వ్యసనంగా మారిపోయారు. ఆయనను చూసేందుకు..
పవన్ కళ్యాణ్ అంటే.. ఓ వ్యసనం అని బండ్ల ఏ క్షణాన అన్నారో తెలియదు కాని.. నిజంగానే ఆయన తన అభిమానులకు ఓ వ్యసనంగా మారిపోయారు. ఆయనను చూసేందుకు.. ఆయన మాటలు వినేందుకు… ఆయన్ను తాకేందుకే పరితపిస్తున్నారు. అందుకోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితులను.. పరిసరాలను పట్టించుకోకుండా… పవన్ ను టచ్ చేసేందుకు పాకులాడుతున్నారు. ఆయన్ను కూడా గాయాల పాలు చేస్తున్నారు.ఇక రీసెంట్‌గా జనసేనాని తన కార్యకర్తలతో కలిసి రోడ్ షో చేశారు. తన ఎస్ యూవీ సన్ రూఫ్ నుంచి నుంచి బయటికి వచ్చి తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ పలకరించారు. వారినుద్దేశిస్తూ మాట్లాడాడారు. ఇక ఈ క్రమంలోనే షర్ట్ లేకుండా ఉన్న పవన్ వీరాభిమాని ఒకరు పక్కనే ఉన్న మరో కారు మీది నుంచి పవన్ కారు మీదికి ఒక్కసారిగా అమాంతంగా దూకారు. పవన్ ను కౌగిలించుకునేందుకు తెగ ట్రై చేశాడు. అయితే పవన్ కు రక్షణగా ఉన్న బాడీగార్డ్స్ ఆ ఫ్యాన్స్ కారు మీది నుంచి కిందికి తోసేశారు. అయినా ఏమాత్రం తగ్గని ఆ హార్డ్ కోర్ ఫ్యాన్..ఈ సారి కారు వెనక భాగం నంచి మరోసారి పవన్ కారు ఎక్కారు. ఇక ఈ సారి ఆ వ్యక్తి బాడీగార్డ్స్ గట్టిగా పట్టకుని పక్కకు తీసుకెళ్లారు. అయితే పవన్ ను తాకడం కోసం ఈ ఫ్యాన్స్ చేసిన సాహసం అక్కడున్న వారందర్నీ షాక్ చేసింది. పిచ్చోడా ఏంటనే కామెంట్ వచ్చేలా చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
