Shocking Video: షాకింగ్ వీడియో..! వాహనదారులు ఈ వీడియో చూసి అయినా వాయువేగాన్ని తగ్గించండి.. సెకన్లలో కారు నుజ్జు..నుజ్జు..
ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వాహనాలు అతివేగంగా నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మద్యం సేవించినా, సేవించకపోయినా కొంతమంది వాయువేగంతో వాహనాలను నడుపుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వాహనాలు అతివేగంగా నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మద్యం సేవించినా, సేవించకపోయినా కొంతమంది వాయువేగంతో వాహనాలను నడుపుతున్నారు. ఈ కారణంగా వారితో పాటు ఎదుటవారు కూడా ప్రమాదంలో పడుతున్నారు. ఇక తరచూ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో..రద్దీగా ఉన్న ఓ రోడ్డుపై తెల్లటి కారు వేగంగా దూసుకొస్తోంది. రోడ్డంతా వాహనాలు రద్దీగా నడుస్తున్నాయి.. ఇంతలో ఓ కారు ఓ పక్క నుంచి మితిమీరిన వేగంతో దూసుకొచ్చింది. కార్లన్నింటినీ దాటుకుని మధ్యలోకి వచ్చేసరికి ఆ కారు టైర్ల బ్యాలెన్స్ తప్పింది. అంతే.! ఆ కారు కాస్తా స్కిడ్ అయ్యి రోడ్డు ప్రక్కనే ఉన్న ఓ చెట్టుకు గుద్దుకుని నుజ్జునుజ్జయ్యింది. ఈ యాక్సిడెంట్‌లో ఆ కారు వెనుక భాగంగా బాగా దెబ్బతింటుంది. యాక్సిడెంట్ వీడియోను చూస్తే కచ్చితంగా అందులో ప్రయాణించేవారికి తీవ్రంగా దెబ్బలు తగిలి ఉండొచ్చు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసింది. దాంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోను వీక్షిస్తున్న లక్షలమంది నెటిజన్లు లైక్స్‌తో పలు రకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఆ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని చూడండి ఇక్కడ:
