Funny Video: డెవడండీ బాబు.. ఎంత హెల్మెట్ పెట్టుకుంటేమాత్రం ఇలాగా చెయ్యాలా..
ఈ వీడియోలో ఒక హైవేపై రెడ్ కలర్ కారు వెళ్తోంది. కొంతదూరం వెళ్లాక ట్రాఫిక్ సిగన్నల్ లైట్ పడటంతో కారు అక్కడ ఆగింది. ఆ కారు వెనకాలు ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని బైక్‌పై వేగంగా వస్తున్నాడు. సిగ్నల్ పడింది, కారు ఆగింది.. వెనక వచ్చిన బైక్ కూడా అక్కడ ఆగాలి.. కానీ..
చిత్ర విచిత్రమైన కంటెంట్‌కు నిలయం సోషల్‌మీడియా. ఇక్కడ ఎన్నో వినోదాద్మక వీడియోలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు, భీతిగొలిపే దృశ్యాలు అన్నీ క్షణాల్లో కళ్లముందు చూపిస్తుంది. సరే, రోడ్డుపై వాహనాలు వెళ్తున్నప్పుడు అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. అవి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డవుతుంటాయి. అవి నెట్టింట చేరి హల్‌చల్ చేస్తుంటాయి. ప్రస్తుతం ఓ యాక్సిడెంట్‌కి సంబంధించిన వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది… యాక్సిడెంట్ ఏంటి.. నవ్వించడమేంటి అనుకుంటున్నారు కదా… అదేంటో చూసేయండిమరి.. ఈ వీడియోలో ఒక హైవేపై రెడ్ కలర్ కారు వెళ్తోంది. కొంతదూరం వెళ్లాక ట్రాఫిక్ సిగన్నల్ లైట్ పడటంతో కారు అక్కడ ఆగింది. ఆ కారు వెనకాలు ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని బైక్‌పై వేగంగా వస్తున్నాడు. సిగ్నల్ పడింది, కారు ఆగింది.. వెనక వచ్చిన బైక్ కూడా అక్కడ ఆగాలి.. కానీ ఆ వ్యక్తి బైక్‌ను కంట్రోల్ చేయలేకపోయాడు. దాంతో నేరుగా వచ్చి కారును ఢీకొంటాడు. వేగంగా వచ్చి కారును ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎగిరి కారుపై పడ్డాడు. కారుపై పల్టీకొడుతూ వచ్చి బ్యానెట్‌పై కూర్చున్నాడు. ఊహించని ఘటనతో కారులో ఉన్న మహిళ కారుదిగి చూసేసరికి కారుపై వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతన్ని చూసి మహిళ షాకయ్యింది. పరిస్థితిని అర్థం చేసుకుంది. అతనికి గాయాలైనట్టు తెలుస్తోంది. కారుకూడా బాగానే దెబ్బతింది. కానీ పాపం ఆ మహిళ అతన్ని ఏమీ అనలేదు. ఇదంతా అక్కడ సీసీ కెమెరాలో రికార్డైంది. ఇప్పుడు నెట్టింట చేరి హల్‌చల్ చేస్తోంది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!