Viral Video: వారేవా..! నిత్య పెళ్లికూతురు.. ఏకంగా 30 పెళ్లిళ్లు 31వ పెళ్లికి సిద్ధమవుతుండగా ఊహించని ట్విస్ట్..

Updated on: May 20, 2022 | 9:04 AM

రాజ్థాన్‌లో ఓ నిత్య పెళ్లికూతురు పోలీసులకు పట్టుబడింది. ఇప్పటి వరకు 30 పెళ్లిళ్లు చేసుకొని, 31వ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న మహిళతో పాటు మరికొందరిని రాజ్థాన్‌ పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌ లోని జబల్‌పూర్‌ లో ఈ దొంగ పెళ్లికూతురును అదుపులోకి తీసుకున్నారు.


రాజ్థాన్‌లో ఓ నిత్య పెళ్లికూతురు పోలీసులకు పట్టుబడింది. ఇప్పటి వరకు 30 పెళ్లిళ్లు చేసుకొని, 31వ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న మహిళతో పాటు మరికొందరిని రాజ్థాన్‌ పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌ లోని జబల్‌పూర్‌ లో ఈ దొంగ పెళ్లికూతురును అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసుల విచారణలో సంచలన విషయాలు తెలిశాయి. చాలాకాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారిని ఎంచుకొని, వారే లక్ష్యంగా మోసాలు చేస్తోందని పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ లోని జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రకాశ్ చంద్ర భట్‌ అనే వ్యక్తికి గతేడాది వివాహం జరిగింది. ఓ పెళ్లిళ్ల ఏజెంట్ అతనికి రీనా ఠాకూర్ అనే యువతితో పెళ్లి జరిపించాడు. పెళ్లిని సెట్ చేసినందుకు అతడు వరుడి నుంచి 5 లక్షలు తీసుకున్నాడు.పెళ్లయిన వారం రోజుల పాటు అత్తింట్లో ఉన్న రీనా ఆ తర్వాత ప్రకాశ్ చంద్రతో కలిసి జబల్‌పూర్‌కు వెళ్లింది. అక్కడి నుంచి మళ్లీ తిరిగి వస్తుండగా ప్రకాశ్ చంద్రపై దాడి చేయించింది. అనంతరం తన గ్యాంగ్‌తో కలిసి పారిపోయింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కంప్లైంట్ తో కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో కీలక విషయాలు తెలిశాయి. జబల్‌పూర్‌కు చెందిన పూజా బర్మన్ అనే వ్యక్తి ఈ నకిలీ పెళ్లిళ్ల ముఠాను నడుపుతున్నట్లు గుర్తించారు. నకిలీ పేర్లు, కొంతమంది అమ్మాయిల చిరునామాలు, ఆధార్ కార్డులు, ఇతర ధృవపత్రాలు తయారు చేసి, ఏజెంట్ల సహాయంతో నకిలీ పెళ్లిళ్లు చేయిస్తున్నాడని గుర్తించారు. అనంతరం వారి నుంచి డబ్బు, బంగారం, వెండి ఆభరణాలు దోచుకొని పారిపోతున్నారని పోలీసులు తెలిపారు. వీరి చేతిలో ఇప్పటివరకు చాలా మంది మోసపోయారని వెల్లడించారు. రీనా ఠాకూర్‌ అండ్‌ టీమ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Gold in Sea: బీచ్‌లో బంగారం దొరుకుతుందట..! సముద్ర తీరానికి ఎగబడ్డ జనం..!

Electrician Love: అబ్భా ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది అంటే ఇదే మరి..! గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఎలక్ట్రీషియన్ వింత పని..!

Viral Video: దాని కోసం ఇలా చేస్తారా..? భర్త ఇంట్లో బాత్ రూమ్ లేదని భార్య ఆత్మహత్య..!

Published on: May 20, 2022 09:04 AM
Loading...
Unable to load recommendations.
Follow Us