Viral Video: మోసగాళ్లకు మోసగాడు.. ఏం జరిగిందో చూడండి..! ఈ వీడియో చుస్తే కర్మ ఫలం అంటే ఏంటో బాగా తెలుస్తుంది..

|

Mar 11, 2022 | 9:02 AM

సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో పండ్ల వ్యాపారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.


సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో పండ్ల వ్యాపారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. అతడి దగ్గరికి వచ్చిన కస్టమర్‌ను చాలా తెలివిగా మోసం చేయాలనుకున్నాడు. కట్ చేస్తే సీన్ కాస్తా రివర్స్ అయింది. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరు కూడా లుక్కేయండి.!నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి పండ్ల దుకాణానికి వచ్చి కొన్ని పండ్లు కొన్నాడు. దుకాణదారుడు కస్టమర్‌ అడిగిన పండ్లను తూకం వేసి ఒక కవరులో పెట్టి ఇస్తాడు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఇక్కడే దుకాణదారుడు తన దుర్బుద్దిని ప్రదర్శించాడు. కస్టమర్‌ని మోసం చేయబోయాడు. కవర్‌లో వేసిన పండ్ల నుంచి ఒకటి బయటికి తీసేస్తాడు. ఇదంతా కస్టమర్‌ గమనించలేదని అతడు అనుకున్నాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కస్టమర్ ఈ తతంగం మొత్తం గమనించాడు.. దుకాణదారుడికి ఇవ్వడానికి ఫర్సులోంచి డబ్బులు తీస్తుంటాడు. ఇంతలో దుకాణదారుడు పండ్ల కవరు కస్టమర్‌కి ఇస్తాడు. డబ్బులు తియ్యడం ఆపి పండ్ల కవర్ తీసుకుని కస్టమర్‌ తుర్రుమని పారిపోతాడు. నెత్తీ నోరే బాదుకుంటూ దుకాణదారుడు అతని బండివెనక పడ్డాడు.. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.. .అలాగే.. మోసగాళ్లకు మోసగాడు అంటే ఇతనే.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..