An ancient fish: వామ్మో.. అతి పెద్ద చేప..! జాలరుల వలలో చిక్కిన అరుదైన చేప.. డైనోసార్‌ను మించి.. వీడియో.

|

Feb 02, 2023 | 9:08 PM

సరదాగా చేపల వేటకు వెళ్లిన ఓ తండ్రీ కొడుకులకు అరుదైన చేప దొరికింది. వీకెండ్స్‌లో ఫిషింగ్‌ చేయడం వారి హాబీ. ఈ క్రమంలో తండ్రీ కొడుకులు ఇద్దరూ సముద్రంలో వల వేసారు. కాసేపటికే వారి వల విపరీతంగా బరువెక్కింది.

సరదాగా చేపల వేటకు వెళ్లిన ఓ తండ్రీ కొడుకులకు అరుదైన చేప దొరికింది. వీకెండ్స్‌లో ఫిషింగ్‌ చేయడం వారి హాబీ. ఈ క్రమంలో తండ్రీ కొడుకులు ఇద్దరూ సముద్రంలో వల వేసారు. కాసేపటికే వారి వల విపరీతంగా బరువెక్కింది. దాంతో దానిని పైకి లాకిన వారు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. తమ వలలో పడ్డ వింత చేపను చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ చేపతో వారు ఆ రాష్ట్రంలోనే కొత్త రికార్డు సృష్టించారు. ఈ ఘటన అలబామాలో చోటుచేసుకుంది.ఆ తండ్రీ కొడుకుల వలకు చిక్కిన ఆ వింత చేపను అధికారులకు చూపించారు. అప్పుడు తెలిసింది వారికి.. అది డైనోసార్ల కంటే పురాతనమైనదని, ఎంతో అరుదైన ‘సజీవ శిలాజ’ ఫిష్‌గా తెలిసి వారు ఆశ్చర్యపోయారు. తండ్రి కొడుకులు, కీత్ డీస్, హంట్లీ గత నవంబర్‌లో మొబైల్-టెన్సా డెల్టా, అలబామాలో వారి వార్షిక థాంక్స్ గివింగ్ ఫిషింగ్ ట్రిప్‌లో ఉండగా, వారు అరుదైన “సజీవ శిలాజ” ఫిష్‌ని పట్టుకున్నారు. భయంకర క్యాచ్ డైనోసార్ల కంటే కూడా ఈ చేప పురాతనమైనదిగా తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ చేపను అధికారికంగా ఆరెంజ్‌ బీచ్‌ మెరీనాలో తూకం వేయగా 73.5 కేజీల బరువు తూగింది. ఇది అంతకుముందున్న అలబామా రాష్ట్ర రికార్డును అధిగమించింది. ఇది వారి ఫిషింగ్‌ హ్యబిట్‌లో రికార్డు-బ్రేకింగ్ ఆవిష్కరణగా..వెల్లడించారు. ఇలాంటి నమ్మశక్యం కానీ ఈ విషయాన్ని ఆ తండ్రీకొడుకులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దాంతో వార్త వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on