అమ్మో.. ఒక్క ఫ్యాంట్ రూ.60 లక్షలా !! ఏముంది భయ్యా అందులో !!
సాధారణంగా పాత వస్తువులను కొన్నాళ్లకు బయటపడేస్తాం. వాటి స్థానంలో కొత్త వస్తువులను తెచ్చుకుంటాం. అలాటే బట్టలు కూడా కొన్నాళ్లు వేసుకున్నాక పక్కనపెట్టేస్తాం.
సాధారణంగా పాత వస్తువులను కొన్నాళ్లకు బయటపడేస్తాం. వాటి స్థానంలో కొత్త వస్తువులను తెచ్చుకుంటాం. అలాటే బట్టలు కూడా కొన్నాళ్లు వేసుకున్నాక పక్కనపెట్టేస్తాం. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ కొన్ని పురాతన వస్తువులను కోట్లు పెట్టి కొంటుంటారు కొందరు. ఎందుకంటే కొన్ని వస్తువులు ఎంత పాతవైతే అంత విలువ పెరుగుతుంది. అందుకే కొంతమంది అలాంటి వాటి కోసం వేచి చూస్తుంటారు. వేలంలోకి రాగానే భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మెక్సికోలో చోటు చేసుకుంది. అమెరికాలోని న్యూ మెక్సికోలో జరిగిన వేలంలో 1880ల నాటి లెవీ జీన్స్ ప్యాంట్ ఒకటి 76,000 డాలర్లకి అంటే భారత కరెన్సీ ప్రకారం 60 లక్షలరూపాయలకు పైనే అమ్ముడైంది. శాన్ డియాగోకు చెందిన పాతకాలపు దుస్తుల వ్యాపారి కైల్ హౌపెర్ట్ ఇటీవల జరిగిన వేలంలో ఈ జీన్స్ ప్యాంటును కొనుగోలు చేశాడు. అయితే, హౌపెర్ట్ కొనుగోలుదారుల ప్రీమియంతో కలిపి మొత్తం 87,400 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: