Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

|

Dec 09, 2022 | 7:04 PM

పెంపుడు జంతువులకు స్నానం చేయిస్తూ.. వాటి బాగోగులు చూడటం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కాని.. పామలకు ఎవరైనా స్నానం చేయిస్తారా..?


పెంపుడు జంతువులకు స్నానం చేయిస్తూ.. వాటి బాగోగులు చూడటం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కాని.. పామలకు ఎవరైనా స్నానం చేయిస్తారా? అసలు పాములు పెంపుడు జంతువులేంటండి బాబు అనుకుంటున్నరా.. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఇది స్టంట్‌ కాదు, కానీ ఏదో కుక్కపిల్లకి స్నానం చేయించినట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు ఓ వ్యక్తి. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి చాలా పొడువుగా ఉన్న కింగ్‌ కోబ్రాకి తల మీద నుంచి నీళ్లు పోస్తూ స్నానం చేయిస్తున్నాడు. పైగా ఆ పాము అతడు నీళ్లు పోస్తున్న మగ్గును పలుమార్లు కాటేస్తోంది.కానీ ఆ వ్యక్తి అదేం పట్టించుకోకుండా చక్కగా కోబ్రాకి స్నానం చేయించే పనిలో ఉన్నాడు. మహిళలు పురుషుల కంటే 5% ఎక్కువగా బతకడానికి కారణం ఇదే నంటూ ఈ వీడియో గురించి చెబుతున్నారు. ఎందుకంటే పురుషులు డేరింగ్‌ స్టంట్స్‌ చేస్తుంటారు … దాంతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. అందువల్ల ఎక్కువ కాలం జీవించరంటూ గొప్ప స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు. కాగా ఈ వీడియోను ఒక ఇన్‌స్ట్రాగామ్‌ వినియోగదారుడు చల్లటి నీళ్లతో కోబ్రాకి బాత్‌ అనే క్యాప్షన్‌ జోడించి పోస్ట్‌ చేశాడు. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించగా.. వేల మంది లైక్ లు కొట్టారు. పెంపుడు జంతువులకు స్నానం చేయించినంత ఈజీగా కోబ్రాకు స్నానం చేయించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Follow us on