Lucky woman: అదృష్టం అంటే ఆమెదే.. రెప్పపాటులో బయటపడింది.. ఒళ్ళు గగ్గురు పొడిచే వీడియో..

Updated on: Sep 07, 2022 | 9:12 AM

రోడ్డుపై నడుస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో చిన్ని పొరపాటు కూడా పెనుప్రమాదానికి దారితీస్తుంది.


రోడ్డుపై నడుస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో చిన్ని పొరపాటు కూడా పెనుప్రమాదానికి దారితీస్తుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతుంటాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రమాదాలు కొన్నిసార్లు విధ్వంసం సృష్టిస్తాయి. మరికొన్ని సార్లు అనుభవ పాఠాన్ని నేర్పిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న క్లిప్ లో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ రెండింటి మధ్య ఒక మహిళ ఉంది.. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించండి…

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో ఓ కారు అదుపుతప్పి ఆమె వైపు దూసుకొచ్చింది. వేగంగా వచ్చి అక్కడ పార్క్‌చేసి ఉన్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారుకి, ఆటోకి మధ్యలోమహిళ ఉండిపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఘటనలో ఆ మహిళకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రెండు వాహనాలు బోల్తా పడిన తర్వాత మహిళ తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను వీక్షించిన వేలాదిమంది నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 07, 2022 09:12 AM