అయ్యో.. భర్త హగ్‌ చేసుకోగానే కుప్పకూలిన మహిళ

Updated on: Oct 24, 2026 | 6:51 PM

చైనాలో ఓ మహిళ తన భర్త కౌగిలించుకున్న వెంటనే తీవ్రమైన నొప్పితో కిందపడిపోయింది. ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ చేయగా ఐదు పక్కటెముకలు విరిగినట్లు, మరో ఎముకకు పగులు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు తీవ్రమైన ఆస్టియోపొరోసిస్‌ ఉన్నట్లు తేలింది. కఠినమైన డైటింగ్‌, పోషకాహార లోపం, విటమిన్‌ డి కొరత వంటి అంశాలు ఎముకల బలహీనతకు దోహదపడవచ్చని వైద్యులు సూచించారు.

చైనాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. జియాంగ్స్‌ ప్రావిన్స్‌కు చెందిన వాంగ్ అనే వ్యక్తి, భార్యకు చలిగా ఉందంటే ప్రేమగా కౌగిలించుకున్నాడు. ఆ మరుక్షణమే ఎముకలు విరిగిన శబ్దం రావడం, ఆ మహిళ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతూ కిందపడిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. మరుసటి రోజు ఆసుపత్రికి తీసుకెళ్లి సీటీ స్కాన్ చేయించగా.. ఆమెకు ఐదు పక్కటెముకలు విరిగిపోయాయని, మరో ఎముకకు పగులు ఏర్పడిందని తేలింది. సాధారణ కౌగిలింతకే ఎముకలు విరిగిపోవడం చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. చివరకు ఆ మహిళ జీవనశైలి, ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణమని గుర్తించారు. సదరు మహిళకు తీవ్రమైన ‘ఆస్టియోపొరోసిస్’ ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఆమె బరువు తగ్గడానికి నిరంతరం కఠినమైన డైటింగ్ చేయడం, రాత్రి భోజనాన్ని మానేయడం, రోజూ కాఫీ తాగడం మరియు శరీరానికి అసలు ఎండ తగలకుండా పూర్తిగా కప్పుకోవడం వంటి అలవాట్లు ఉన్నాయి. బయటకు వెళ్లినా ఎండ తగలకుండా ఉండటంతో శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి తగ్గిపోయింది. దీనికి తోడు కెఫిన్ వల్ల శరీరంలో కాల్షియం లోపించి ఎముకలు బలహీనంగా మారిపోయాయి. దీంతో చిన్నపాటి ఒత్తిడికే పక్కటెముకలు విరిగిపోయాయి. ఈ ఘటనపై స్పందించిన ఆర్థోపెడిక్ వైద్యుడు యువతలో ఇలాంటివి జరగడం అరుదని, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, విటమిన్ డి లోపం, అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల ఎముకలు గుల్లబారతాయని హెచ్చరించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి, ఇంటి వద్దే కోలుకుంటోంది. సరైన ఎండ, కాల్షియం ఉండే ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంపై దృష్టి పెడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేదార్‌నాథ్‌లో మంచు వర్షం.. సెల్ఫీలతో యాత్రికుల సందడి

ఎస్‌బీఐ కస్టమర్ల డేటా లీక్ ! పాస్‌వర్డ్స్ మార్చుకోవాలని నిపుణుల సూచన

2027 ప్రపంచకప్‌.. కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై బీసీసీఐ చీఫ్ క్లారిటీ

యువకుడిని కిడ్నాప్‌ చేసిన దొంగలు.. అతని వద్ద డబ్బులు లేవని.. ఏంచేశారో చూడండి!

Loading...
Unable to load recommendations.
Follow Us