Viral video: వాచ్‌మెన్ కోసం ప్రాణం ఫణంగా పెట్టిన కుక్క..! చివరికి ఎం జరిగిందంటే..

|

Mar 13, 2023 | 8:19 AM

గుంటూరులో వాచ్‌మెన్లుగా పనిచేస్తున్న ఇద్దరిని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు పోలీసుల చేతికి చిక్కాయి. అయితే వాచ్‌మెన్ హత్యను నిలువరించేందుకు

గుంటూరులో వాచ్‌మెన్లుగా పనిచేస్తున్న ఇద్దరిని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు పోలీసుల చేతికి చిక్కాయి. అయితే వాచ్‌మెన్ హత్యను నిలువరించేందుకు ఓ కుక్క ప్రయత్నించిన తీరు అందరిని కలచివేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యాయి. బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న యమహా షోరూం దగ్గర ఆగారు. అక్కడే కూర్చిలో కూర్చున్న వాచ్ మెన్ కృపానిధిపై రాడ్డుతో దాడి చేశారు. కుర్చీలో కూర్చున్న అతను కూర్చున్నట్టే ప్రాణాలు విడిచాడు. ఈ సమయంలో అటుగా వచ్చి ఓ కుక్క దాడి చేస్తున్న దుండగుడిపైకి బిగ్గరగా అరుస్తూ వచ్చింది. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. వాచ్‌మెన్‌ను హత్య చేస్తుంటే ఆ మూగ ప్రాణి తల్లడిల్లింది. ఆ తర్వాత షోరూంలోకి వెళ్లిన దుండగలు.. చేతికి దొరికిన కాడికి దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అర్ధరాత్రి గుంటూరు నగరంలో గంజాయి మత్తులో తిరుగుతూ బీభత్సం సృష్టించారు. ఏకంగా ఇద్దరు వాచ్‌మెన్లను చంపేసి.. ఇద్దరు సెక్యూరిటీ గార్డులను హత్య చేసి, మరో సెక్యూరిటీ గార్డుపై హత్యాయత్నం చేశారు. పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్‌పై కూడా దాడికి యత్నించారు. అలాగే పాతగుంటూరు, కొత్తపేట తదితర ప్రాంతాల్లో పలువురిపై దాడులకు తెగబడ్డారు. రాడ్లు కర్రలతో అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగుతూ.. షాపుల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు క్లూస్‌టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరిని కోబాల్డ్‌పేట, మరొకరిని స్వర్ణభారతినగర్‌ పరిధిలోని సుందరయ్యనగర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 13, 2023 08:19 AM