Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Updated on: Sep 03, 2022 | 9:59 PM

అమ్మే ప్రత్యక్ష దైవం. దేవుడు సైతం అమ్మకు తలవంచాల్సిందే. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడటమే కాదు.. వారికి ఎలాంటి కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది. అమ్మ రుణాన్ని ఎవ్వరూ తీర్చలేరు.


అమ్మే ప్రత్యక్ష దైవం. దేవుడు సైతం అమ్మకు తలవంచాల్సిందే. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడటమే కాదు.. వారికి ఎలాంటి కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది. అమ్మ రుణాన్ని ఎవ్వరూ తీర్చలేరు. ‘అమ్మ’ గురించి ఇలా ఎంత చెప్పినా తక్కువే. అలాంటి అమ్మ.. మనతో లేకపోతే.. ఆ బాధ వర్ణనాతీతం. తల్లిని పోగొట్టుకున్న ఓ చిన్నారి వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ‘అమ్మా.. అమ్మా’ అంటూ ఓ పిల్లాడు తన తల్లి సమాధి వద్ద ఏడుస్తున్నాడు. ఇది పాత వీడియో.. అయినప్పటికీ మరోసారి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. పిల్లాడి తల్లి కొద్దిరోజుల క్రితం చనిపోయింది. తన తల్లి ఎక్కడుందని ఆ రెండేళ్ల పిల్లాడు వాళ్ల అమ్మమ్మను అడగ్గా… భూమి లోపల నిద్రపోతుందని చెప్పింది. దాంతో ఆ పిల్లాడు తన తల్లి సమాధి దగ్గర రంద్రంచేసి.. ‘అమ్మా.. అమ్మా’ అంటూ పిలిచాడు. ఎంత పిలిచినా తన అమ్మ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఆ పిల్లాడు ఏడుస్తున్న దృశ్యం చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. పిల్లాడి బాధను చూసి.. నెటిజన్లు కన్నీటి పర్యంతం అవుతూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

Published on: Sep 03, 2022 09:59 PM
Follow Us