తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!

Edited By:

Updated on: Sep 12, 2026 | 6:15 PM

తిరుమలలో పాముల సంచారం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. అన్నమయ్య భవన్‌లోని ఓ వసతి గదిలో ఏకంగా 9 అడుగుల జర్రిపోతు కనిపించడంతో యాత్రికులు భయపడ్డారు. వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించగా, ఫారెస్ట్‌ విభాగానికి చెందిన పాము పట్టే ఉద్యోగి భాస్కర్‌ నాయుడు అక్కడికి చేరుకున్నారు. చాకచక్యంగా పామును పట్టుకుని బ్యాగ్‌లో బంధించిన ఆయన, బైక్‌పై శేషాచలం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా వదిలిపెట్టారు.

తిరుమల కొండ పై పాముల సందడి కొనసాగుతూనే ఉంది. టీటీడీ సిబ్బంది భక్తుల కంటపడి అలజడి చేస్తున్న పరిస్థితి నెలకొంది. తరచూ కనిపిస్తున్న పాములు భక్తులను భయపెడు తుండగా శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న పాముల సంఖ్య ఈ మధ్యకాలం లో ఎక్కువైంది. ఇందులో భాగం గానే ఏకంగా భక్తులు బస చేసే వసతి గదుల్లోకి వస్తున్నాయి. అన్నమయ్య భవన్ లోని ఒక గదిలో 9 అడుగుల జర్రిపోతు కనిపించింది. గదిలో నక్కి ఉన్న జర్రిపోతును గమనించిన యాత్రికులు అక్కడే టిటిడి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 9 అడుగుల జెర్రిపోతు ఉందని అందరూ భయపడ్డారు. అక్కడే ఉన్న టిటిడి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై టీటీడీ ఫారెస్ట్ విభాగంలో పాములు పట్టే కాంట్రాక్టు ఉద్యోగి భాస్కర్ నాయుడు కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు 9 అడుగుల జర్రిపోతును పట్టుకునే ప్రయత్నం చేశారు. చాకచక్యంగా బంధించిన సేఫ్ గా జర్రి పోతును చేత్తో పట్టుకుని బ్యాగ్ లో బంధించాడు. బైక్ పై తీసుకెళ్లిన భాస్కర్ నాయుడు శేషాచలం అటవీ ప్రాంతం లో వదిలి పెట్టారు. దీంతో భక్తులు, టిటిడి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లలకే కాదు.. పెద్దలకూ ఈ టీకాలు చాలా అవసరం

పుట్టగానే పాస్‌పోర్ట్‌.. ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి

హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..

Bigg Boss 10 Telugu News: బిగ్ బాస్‌ 10 – కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్‌

మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?

 

Loading...
Unable to load recommendations.
Follow Us