అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..
తల్లి ఆరోగ్యం మెరుగుపడాలని శివుడికి మొక్కుకున్న 19 ఏళ్ల బిహార్ యువకుడు మోనూ మెటురబాలా దేశవ్యాప్తంగా పరుగుల యాత్ర చేపట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం 12 జ్యోతిర్లింగాలను పరుగెత్తుతూ దర్శించుకుంటున్నాడు. 2026 మార్చి 15న పాట్నా నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో రోజూ సుమారు 50 కిలోమీటర్లు పరిగెడుతున్నాడు. అతని తల్లిపై ప్రేమ, శివుడిపై భక్తి, పట్టుదల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దారిపొడవునా ప్రజలు అతనికి స్వాగతం పలుకుతూ, సహాయం అందిస్తున్నారు.
భూమిపై కనిపించే దైవం అమ్మ… అలాంటి అమ్మకు అనారోగ్యం పాలైతే.. ఆమె త్వరగా కోలుకోవాలని, తిరిగి ఆరోగ్యంగా తిరగాలని కోరుకుం 19 ఏళ్ల యువకుడు దేశమంతా పరిగెడుతున్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 12 జ్యోతిర్లింగాలను పరిగెడుతూ దర్శించుకుంటున్నాడు. ఈ యువ యాత్రికుడికి అడుగడుగునా జనం నీరాజనం పడుతున్నారు. బీహార్ పాట్నాకు చెందిన మోను మెటురబాలా అనే యువకుడు… తన తల్లి అనారోగ్యానికి గురికావడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. అమ్మను ఆ పరిస్థితిలో చూడలేకపోయాడు. అమ్మ ఆరోగ్యం కోలుకుని, మళ్లీ మామూలుగా తిరిగితే దేశంలో ఉన్న 12 జ్యోతిర్లాంగాలను పరుగెత్తుకుంటూ వచ్చి దర్శించుకుంటానని ఆ శివయ్యకు మొరపెట్టుకున్నాడు. ఆ శివుని అనుగ్రహం వల్ల తన తల్లి ఆరోగ్యం కుదుటపడింది. దీంతో శివయ్యకు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి బయలుదేరాడు ఆ యుకుడు. దేశమంతా పరుగెత్తుతూ జ్యోతిర్లింగాల దర్శనం చేస్తున్నాడు. తల్లిపై అతనికున్న నిస్వార్థ ప్రేమకు ఆ పరమశివుడు కూడా అబ్బురపడేలా సాగుతోంది అతని పరుగు యాత్ర. మోను తన పరుగును 2026 మార్చి 15న పాట్నా నుంచి ప్రారంభించాడు. ప్రతి రోజు 50 కిలోమీటర్లు పరిగెడతాడు. అయితే జ్యోతిర్లింగాలతో పాటు చార్ దామ్ యాత్ర కూడా చేయాలని నిర్ణయించుకున్నాడు. పాట్నా నుంచి బయలుదేరి మోను.. మొట్టమొదట జార్ఖండ్ లోని బాబా బైద్యనాథ్ ధామ్ ను దర్శించుకున్నాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం, తమిళనాడులోని రామేశ్వరం, మహారాష్ట్ర నాషిక్ లోకి త్రయంబకేశ్వరం మొదలైన తీర్థ స్థలాలను దర్శించుకున్నాడు. అలాగే మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని పార్లీ వైజ్ఞాత్ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకున్నాడు. మోనూను అందరు బ్లాక్ పాంథర్ మోనూ అని పిలుస్తున్నారు. అమ్మ కోసం మోనూ చేపట్టిన యాత్ర గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోనూ ప్రయాణించే దారిలో జనాలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. పోలీసులు కూడా అతని నిబద్ధతకు ముగ్ధులై శుభాకాంక్షలు తెలిపారు. దైవ అనుగ్రహంతోనే ఇలాంటి క్లిష్టమైన యాత్ర చేస్తున్నాడని కొందరు దేవుడిలా చూస్తున్నారు. కొందరు కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మోనూ పరిగెడుతుంటే యువత చాలా మంది అనుసరిస్తూ.. అతనితో పాటుపరిగెడుతూ తమ గ్రామాల సరిహద్దులను దాటిస్తున్నారు. ప్రతీరోజూ దాదాపు 50 కిలోమీటర్లు పరిగెట్టే మోనూ.. రాత్రుల్లో బస చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. తమకు పుణ్యం దక్కుతుంది అన్నట్లుగా విరాళాలు అందజేస్తున్నారు. మోనూకు ఇస్తే ఆ దేవుడికి ఇచ్చినట్లేనని కొందరు కానుకలు ఇస్తున్నారు. అమ్మకోసం పరుగు ప్రారంభించిన మోనూ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయాడు. తల్లిపై ప్రేమ… శివుడిపై భక్తి… ఇచ్చిన మాటపై నిబద్ధత! ఈ మూడింటి కలయిక మనసును కదిలిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు
గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
టైప్-1 షుగర్ బాధలకు చెక్! 14 ఏళ్ల వరంగల్ కుర్రాడి జీవితమే దీనికి ఉదాహరణ!
నగరంలో పెరుగుతున్న నీటి కొరత.. భవిష్యత్తులో తప్పని ఇబ్బందులు!
Lucky Draw: ఆహా అదృష్టం అంటే ఇతనిదే.. టీ స్టాల్ నుంచి బార్ ఓనర్‌గా
