త‌మిళ‌నాడులో దారుణం !! బిడ్డకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక !! పోలీసుల అదుపులో 12 ఏళ్ల బాలుడు !!

Updated on: Apr 30, 2022 | 9:59 AM

తమిళనాడులో షాకింగ్ కేసు వెలుగుచూసింది. 17 ఏళ్ల పెళ్లికాని బాలిక బిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాశంమైంది. ఈ కేసులో అత్యాచార ఆరోపణలపై 12 ఏళ్ల బాలుడ్ని తంజావూరు(Thanjavur) మహిళా పోలీస్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది.

తమిళనాడులో షాకింగ్ కేసు వెలుగుచూసింది. 17 ఏళ్ల పెళ్లికాని బాలిక బిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాశంమైంది. ఈ కేసులో అత్యాచార ఆరోపణలపై 12 ఏళ్ల బాలుడ్ని తంజావూరు(Thanjavur) మహిళా పోలీస్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం, 2012 కింద బాలుడ్ని అరెస్ట్ చేశారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా బాలుడిని అరెస్టు చేసినప్పటికీ, ఆమె గర్భధారణకు మరెవరైనా కారకులా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల మానేసిన వీరిద్దరూ, ఒకే పరిసరాల్లో నివసిస్తున్నారు. బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఏప్రిల్ 16న రాజా మిరాసుదార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. టెస్టులు చేసిన డాక్టర్లు.. ఆమె తొమ్మిది నెలల గర్భవతి అని గుర్తించారు. అదే రోజు బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు.. అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. బాలిక 12 ఏళ్ల బాలుడు ఇందుకు కారకుడని చెప్పడంతో.. తొలుత పోలీసులు షాక్ తిన్నారు. అనంతరం బాలుడిని అదుపులోకి తీసుకుని.. ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలిగిన పూజా హెగ్డే.. చిరు, కొరటాల చేసిన పనికి సీరియస్

koratala Siva: పాపం కొరటాలను అరాచకంగా తిడుతున్నారుగా !!

హనుమాన్‌ ఆలయంలో అరుదైన ఘటన !! హనుమంతుని దర్శనం తర్వాత ప్రాణాలు విడిచినకోతి

Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్‌ ఏసీలు !!

చనిపోయాడన్న వ్యక్తి పాడె మీద నుంచి లేచి నీళ్లు తాగాడు !! ఆస్పత్రికి తీసుకెళ్తే ??