ఆర్టీసీ సమ్మెలో సమ్మె సైరన్ అర్థరాత్రి నుంచి ఆగిపోనున్న బస్సులు

Updated on: Apr 21, 2026 | 8:18 PM

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ దీర్ఘకాల డిమాండ్ల సాధనకై సమ్మెకు పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ, కార్మిక సంఘాల పునరుద్ధరణ వంటి ప్రధాన డిమాండ్లున్నాయి. ఈ సమ్మె 60 లక్షల మంది ప్రయాణికులను, ముఖ్యంగా మహిళలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలకు పిలిచినా విఫలమయ్యాయి. ప్రభుత్వం సమ్మెను నివారించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తోంది, అయితే కార్మికులు తమ నిర్ణయంపై గట్టిగా ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరోసారి సమ్మె బాట పట్టింది. ఏళ్లుగా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన డిమాండ్ల సాధన కోసం నేడు అర్ధరాత్రి నుంచే సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, రెండో వేతన సవరణ, విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపు వంటి కీలక డిమాండ్లతో కార్మికులు సమ్మె నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘాల నేతలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి నేతృత్వంలోని జేఏసీతో పాటు, గతంలో దూరంగా ఉన్న అశ్వథ్థామరెడ్డి వర్గం కూడా సమ్మెకు మద్దతు తెలపడం గమనార్హం. తెలంగాణలో ఆర్టీసీ విలీనం, పీఆర్‌సీ అమలు వంటి డిమాండ్లతో నేడు కార్మిక సంఘాల జేఏసీ నేతలు నేడు అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. టీజేఎంయూ సహా అన్ని ప్రధాన సంఘాలు మద్దతు తెలపడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించే ముప్పు ఏర్పడింది. నిత్యం 60 లక్షల మంది ప్రయాణికులు, ముఖ్యంగా మహిళా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చల ప్రతిపాదన తెరమీదకు తీసుకొచ్చారు. తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ.. రవాణా శాఖ మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె తప్పడం లేదని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం మొదటి షిఫ్టు నుంచే కార్మికులు విధులను బహిష్కరిస్తారని.. రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు నిలిచిపోతాయని వెల్లడించారు. అయితే సమ్మె సైరన్ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం కాళేశ్వరం పర్యటనలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంపై స్పందించారు. ఆర్టీసీ పేద ప్రజల లైఫ్ లైన్ అని.. దానిని ఆగిపోనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల మెజారిటీ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ.. విలీనం, యూనియన్ల పునరుద్ధరణ వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెన్నై పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత.. జేఏసీ నేతలతో మరోసారి చర్చలు జరిపి సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం తన నివాసంలో ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో సకల జనుల సమ్మెలాగా కార్యరూపం దాల్చుతుందని.. ప్రైవేట్ సిబ్బందితో తమ సమ్మె నిర్వీర్యం చేయాలని చూస్తే ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసు అంటూ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న హెచ్చరించారు. అన్ని యూనియన్ల జేఏసీలు, జేఏసీలో లేని కార్మికులు సైతం సమ్మెకు మద్దతు ఇస్తున్నాయని, ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోతే 22వ తేదీ మొదటి షిఫ్ట్ నుండి సమ్మె మొదలవుతుందని కార్మిక సంఘాలు అంటున్నాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీపై ఆధారపడి ప్రయాణాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా నిత్యం 35 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్నారు. సమ్మె గనుక జరిగితే సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 10 వేల బస్సులు డిపోలకే పరిమితమైతే రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ సకాలంలో స్పందించి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Report : తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు

రెండు నెలలుగా నిద్ర లేదు.. యుద్ధాన్ని ఆపకుండా వదిలేది లేదు

400 ఏళ్ల చరిత్ర అంతం కాబోతుందా ?? కొండపల్లి కళాకారుల కన్నీటి గాథ !!

భారత్‌లో నెల సంపాదన.. విదేశాల్లో ఒక్క రోజులో వస్తోంది..

వేసవి తాపం తట్టుకోవడానికి నిమ్మరసం తాగుతున్నారా.. జాగ్రత్త

Follow Us