శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్
తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను తిరుమల పోలీసులు పట్టుకున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నకిలీ బుకింగ్‌లు సృష్టించి రెండేళ్లుగా దందా కొనసాగించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే దర్శన టికెట్లు, వసతి బుక్ చేసుకోవాలని, నకిలీ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల పేరుతో అమాయక భక్తులను నిలువునా ముంచేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని, రెండేళ్లుగా సాగుతున్న ఈ భారీ దందాకు ఎట్టకేలకు చెక్ పెట్టారు తిరుమల పోలీసులు . ఇద్దరు నిందితులను కటకటాల్లోకి నెట్టారు. చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ‘శ్రవణ్ కళ తిరుమల తిరుపతి దేవస్థానం’ పేరుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికలపై నకిలీ పేజీలను సృష్టించారు. భక్తులకు బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని, తిరుమలలో ఏసీ, నాన్ ఏసీ గదులు ఇప్పిస్తామని నమ్మబలికి ఆన్‌లైన్ ద్వారా నగదు వసూలు చేసేవారు. కేవలం తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా.. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన దాదాపు 100 మందికి పైగా భక్తులను వీరు మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. 2022 నుంచే పవన్ కుమార్ రెడ్డిపై కేసులు ఉన్నప్పటికీ, పోలీసులకు చిక్కకుండా తన అక్రమ దందాను కొనసాగిస్తూనే వచ్చాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తిరుమల టూ టౌన్ పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. భక్తులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శ్రీవారి దర్శన టికెట్లు, వసతి కావాలనుకునే వారు కేవలం టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో కనిపించే నకిలీ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రహదారిపై ఒంటరి ఏనుగు హల్చల్.. భయంతో వణికిపోయిన జనం
చోరీ చేయడం ఈజీగా దొరికిపోవడం ఈ దొంగ ప్రత్యేకత
తల్లిదండ్రులు తినే చపాతీలలో ఎలుకల మందు కలిపిన కూతురు..
JD Chakravarthy: స్లో పాయిజన్ ఇచ్చారు.. చావు అంచులదాకా వెళ్లా..
‘హోటల్లో పని చేస్తున్నప్పుడు చూసి చిరు అవకాశం ఇచ్చారు.. కానీ
