Video: శ్రీశైలం–హైదరాబాద్ హైవేపై పెద్దపులి ప్రత్యక్షం.. వాహనదారుల్లో భయాందోళనలు..!

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షమవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మున్ననూరు నుంచి శ్రీశైలం–హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో రోడ్డుపై పెద్దపులి సంచరిస్తూ కనిపించింది. దీంతో ప్రయాణికులు తమ వాహనాలను నిలిపివేసి దూరం నుంచి పులిని వీక్షించారు.

Updated on: Jul 18, 2026 | 4:56 PM

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షమవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మున్ననూరు నుంచి శ్రీశైలం–హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో రోడ్డుపై పెద్దపులి సంచరిస్తూ కనిపించింది. దీంతో ప్రయాణికులు తమ వాహనాలను నిలిపివేసి దూరం నుంచి పులిని వీక్షించారు. కొంతసేపు రహదారిపై సంచరించిన పులి అనంతరం సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ మార్గంలో ప్రయాణించే వారిలో ఆందోళన నెలకొంది. అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో జాగ్రత్తగా ప్రయాణించాలని వాహనదారులకు సూచించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us