Uttarakhand: అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.

ఉత్తరాఖండ్​లో ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్​లోని బద్రీనాథ్​ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనను జిల్లా ఎస్​పీ డాక్టర్ విశాఖ అశోక్​ ధ్రువీకరించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న SDRF, స్థానిక పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.

Uttarakhand: అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.

|

Updated on: Jun 17, 2024 | 12:00 PM

ఉత్తరాఖండ్​లో ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్​లోని బద్రీనాథ్​ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనను జిల్లా ఎస్​పీ డాక్టర్ విశాఖ అశోక్​ ధ్రువీకరించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న SDRF, స్థానిక పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడినవారిని అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. రుద్రప్రయాగ్‌లో టెంపో ట్రావెలర్ ప్రమాదం గురించి చాలా బాధాకరమైన వార్తలు వచ్చాయని పుష్కర్ సింగ్ ధమీ ఎక్స్​లో పోస్ట్ చేశారు. స్థానిక యంత్రాంగం, SDRF బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయనీ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప వైద్యశాలకు తరలించారనీ ఘటనపై విచారణకు జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబా కేదార్‌ని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్​లో రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles