ఇక 27 భాషల్లో యూట్యూబ్‌ వీడియోలు

Updated on: Feb 08, 2026 | 1:09 PM

యూట్యూబ్ తన ఏఐ ఆధారిత ఆటో-డబ్బింగ్ ఫీచర్‌ను అన్ని ఛానెళ్లకు విస్తరించింది. ఇప్పుడు వీడియోలను 27 భాషల్లోకి ఆటోమేటిక్‌గా డబ్ చేసి చూడవచ్చు, ప్రపంచవ్యాప్తంగా భాషా అడ్డంకులు తొలగిపోతాయి. 'ఎక్స్‌ప్రెసివ్ స్పీచ్'తో సహజమైన వాయిస్ అందిస్తూ, క్రియేటర్లకు గ్లోబల్ రీచ్ పెంచుతుంది. డిసెంబర్ 2025 నాటికి 60 లక్షల మంది దీనిని చూశారు.

ఏఐ ఆధారిత ఆటో-డబ్బింగ్ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది యూట్యూబ్ . ఇప్పటివరకు పరిమితంగా ఉన్న ఈ సౌకర్యం, ఇప్పుడు అన్ని ఛానెళ్లకు విస్తరించింది. దీని ద్వారా వీడియోలను 27 భాషల్లోకి ఆటోమేటిక్‌గా డబ్ చేసి చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను భాష అడ్డంకులు లేకుండా చూసే వీలు కల్పిస్తుంది. 2023లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ ఫీచర్‌ను, 2024లో నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ వీడియోలకు విస్తరించారు. ఇప్పుడు మ్యూజిక్ వీడియోలు మినహా దాదాపు అన్ని రకాల వీడియోలకు ఈ ఆటో-డబ్బింగ్ సదుపాయం వర్తిస్తుంది. ఈ ఫీచర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, డిసెంబర్ 2025లో రోజుకు సగటున 60 లక్షల మందికి పైగా వీక్షకులు కనీసం 10 నిమిషాల పాటు ఆటో-డబ్డ్ కంటెంట్‌ను చూశారని యూట్యూబ్ తెలిపింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా ‘ఎక్స్‌ప్రెసివ్ స్పీచ్’ అనే కీలక ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇది డబ్ చేసిన వాయిస్‌ను మరింత సహజంగా, ఒరిజినల్ స్పీకర్ హావభావాలకు, టోన్‌కు దగ్గరగా ఉండేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హిందీ, ఇంగ్లీష్, స్పానిష్‌తో సహా ఎనిమిది భాషల్లో అందుబాటులో ఉంది. దీనితో పాటు, డబ్బింగ్‌కు అనుగుణంగా స్పీకర్ పెదవుల కదలికలను సరిపోల్చే ‘లిప్ సింక్’ ఫీచర్‌పై కూడా యూట్యూబ్ ప్రయోగాలు చేస్తోంది.,వీక్షకులు తమకు నచ్చిన భాషను ఎంచుకోవడానికి ‘ప్రిఫర్డ్ లాంగ్వేజ్’ సెట్టింగ్‌ను కూడా యూట్యూబ్ జోడించింది. క్రియేటర్లు తమకు ఇష్టం లేకపోతే ఈ ఆటో-డబ్బింగ్ ఫీచర్‌ను ఆఫ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఈ ఫీచర్ వల్ల క్రియేటర్లు తమ కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు సులభంగా చేరువ చేయడానికి గొప్ప అవకాశం లభించినట్లయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెర్త్ దొరకని RAC ప్రయాణికులకు.. కొంత డబ్బు వాపస్!

అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం

లక్కీ ఇండియన్‌.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు