వారెవ్వా.. ఇకపై కరెంట్‌ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే

Updated on: Sep 05, 2026 | 5:39 PM

వాట్సాప్‌ యూజర్లకు మరో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కరెంట్‌, గ్యాస్‌, వాటర్‌ బిల్లులతో పాటు క్రెడిట్‌ కార్డ్‌ బిల్లులు, లోన్‌ ఈఎంఐలను నేరుగా వాట్సాప్‌లోనే చెల్లించుకునేలా ‘బిల్‌ పేమెంట్స్‌’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. భారత్‌ బిల్‌పే సిస్టమ్‌ ఆధారంగా పనిచేసే ఈ సేవ ద్వారా 30 కేటగిరీలకు చెందిన 22 వేలకు పైగా బిల్లర్లకు చెల్లింపులు చేయవచ్చు. యూపీఐతో పాటు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతోనూ బిల్లులు చెల్లించవచ్చు.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు మరో సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. రోజూ మనం చెల్లించే కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లులతో పాటు క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐలను ఇకపై నేరుగా వాట్సాప్ యాప్‌లోనే చెల్లించేలా కొత్త ‘బిల్ పేమెంట్స్’ ఫీచర్‌ను ప్రారంభించింది. భారత్ బిల్‌పే సిస్టమ్ నెట్‌వర్క్ ఆధారంగా ఈ సేవలను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ దశలవారీగా ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా దాదాపు 30 కేటగిరీలకు చెందిన 22 వేలకు పైగా బిల్లర్లకు ఈ సేవ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. వాట్సాప్ హోమ్ స్క్రీన్‌పై ఉండే రూపాయి సింబల్ ద్వారా ఈ విభాగానికి వెళ్లవచ్చు. యూపీఐతో పాటు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా బిల్లులు చెల్లించే సదుపాయం కల్పించారు. మెసేజ్ పంపినంత సులభంగా బిల్లులు చెల్లించేలా చేయడమే తమ లక్ష్యమని మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే దేశంలో వాట్సాప్ పే లావాదేవీలు భారీగా పెరుగుతుండగా, తాజా ఫీచర్‌తో డిజిటల్ చెల్లింపులు మరింత సులభం కానున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bethlehem Kudumba Unit Review: కేరళలో హిట్టే.. మరి మన దగ్గర?

Ramba Urvasi Menaka Review: చాలా రోజుల తర్వాత అల్లరోడి మార్క్‌ కామెడీ.. నవ్వించాడా? బోర్ కొట్టించాడా?

I’m Game Review: సగం గెలిచాడు.. సగంలో ఓడాడు..! హిట్టా..? ఫట్టా..?

Mirzapur Review: మున్నా భయ్యా ఈజ్ బ్యాక్! హిట్టా..? ఫట్టా..?

పాత డీజిల్ వాహనదారులకు శుభవార్త

Loading...
Unable to load recommendations.
Follow Us