భూమి నుంచి నేరుగా అంతరిక్షానికి లిఫ్ట్‌.. త్వరలో నిజం కానుందా?

Updated on: Sep 04, 2026 | 9:20 PM

రాకెట్లు లేకుండానే మనుషులను అంతరిక్షానికి తీసుకెళ్లే ‘స్పేస్‌ ఎలివేటర్‌’పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. భూమధ్యరేఖ సమీపం నుంచి భూస్థిర కక్ష్యను దాటి సుమారు 66 వేల మైళ్ల పొడవైన కేబుల్‌ను ఏర్పాటు చేయాలన్నది ఈ ఆలోచన. ఉక్కు కంటే వంద రెట్లు బలమైన, తేలికైన పాలీక్రిస్టలైన్‌ గ్రాఫీన్‌ను ఇందుకు ఉపయోగించే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే అంతరిక్ష ప్రయాణ ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉంది.

భవిష్యత్తులో రాకెట్ల అవసరం లేకుండానే నేరుగా అంతరిక్షానికి వెళ్లేలా ‘స్పేస్‌ ఎలివేటర్‌’ నిర్మించే దిశగా శాస్త్రవేత్తలు కీలక అడుగులు వేస్తున్నారు. భూమధ్యరేఖ సమీపంలో భూమి నుంచి భూస్థిర కక్ష్యను దాటి దాదాపు 66 వేల మైళ్ల పొడవున ఈ కేబుల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా మనుషులు, సరకులను ఎలాంటి రాకెట్ల ప్రమేయం లేకుండానే సులువుగా అంతరిక్షానికి తరలించవచ్చు. అయితే దీని నిర్మాణానికి ఉక్కు కంటే వంద రెట్లు బలంగా, తేలికగా ఉండే పదార్థం అవసరం. అయితే, ‘పాలీక్రిస్టలైన్‌ గ్రాఫీన్‌’ ఇందుకు సరైన మార్గమని ఇంటర్నేషనల్‌ స్పేస్‌ ఎలివేటర్‌ కన్సార్టియం భావిస్తోంది. ఇప్పటికే దక్షిణ కొరియా ఇంజినీర్లు సుమారు 1,000 మీటర్ల పొడవు, అర మీటరు వెడల్పు ఉన్న గ్రాఫీన్‌ నిర్మాణాన్ని తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు. అంతరిక్ష వ్యర్థాల ముప్పు నుంచి రక్షించుకోవడానికి పలు కేబుళ్లను అమర్చడంతో పాటు ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఎలివేటర్ అందుబాటులోకి వస్తే అంతరిక్ష ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. భూస్థిర కక్ష్యకు చేరేందుకు దాదాపు రెండు వారాలు పట్టవచ్చని, అక్కడి నుంచి చంద్రుడిని కేవలం 14 గంటల్లో చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది పరిశోధన దశలోనే ఉన్నప్పటికీ, నిర్మాణానికి దశాబ్దం నుంచి రెండు దశాబ్దాల సమయం పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆలోచన కనుక కార్యరూపం దాలిస్తే అంతరిక్ష ప్రయాణ రంగంలో ఇదొక సరికొత్త విప్లవాత్మక మార్పుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చంద్రుడు, అంగారకుడిపై ఇల్లు ఎలా? భవిష్యత్‌ దారి చూపించిన శుభాన్షు శుక్లా!

తమిళ సినిమా కోసం.. లైఫ్ ని రిస్క్ లో పెట్టాడు..

‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు రిలీజ్‌కు పెద్ద అడ్డంకి

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే..!

భారతీయులకు అమెరికా మరో షాక్.. గ్రీన్ కార్డ్ కోటా ఖతం!

Loading...
Unable to load recommendations.
Follow Us