ChatGPT లో కీలక మార్పు.. ఇక చాట్‌లోనే గేమ్స్, కాలిక్యులేటర్లు!

Updated on: Oct 15, 2026 | 3:54 PM

ఓపెన్‌ఏఐ చాట్‌జిపిటీలో ‘ఇంటెలిజెంట్‌ యూఐ’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. జీపీటీ-6 ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్‌తో సమాధానాలు కేవలం టెక్స్ట్‌కే పరిమితం కాకుండా చార్టులు, గ్రాఫిక్స్‌, ఇంటరాక్టివ్‌ మ్యాప్‌లు, కాలిక్యులేటర్లు, గేమ్స్‌ రూపంలోనూ కనిపించవచ్చు. సమాధానం పూర్తిగా సిద్ధమయ్యేలోపే చదవడం ప్రారంభించే సదుపాయం కూడా ఉంది. ఈ ఫీచర్‌ను చెల్లింపు, ఉచిత ప్లాన్లకు దశలవారీగా అందిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఓపెన్ ఏఐ సాంకేతిక రంగంలో మరో విప్లవాత్మక అడుగు వేసింది. చాట్‌జిపిటి లో ‘GPT-6’ తో కూడిన ‘ఇంటెలిజెంట్ యుఐ’ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్‌డేట్‌తో ఇకపై ప్రశ్నించినప్పుడు కేవలం టెక్స్ట్ రూపంలోనే కాకుండా ఇంటరాక్టివ్ టూల్స్, గ్రాఫిక్స్ మరియు చార్టుల రూపంలో స్పష్టమైన సమాధానాలు లభించనున్నాయి. కొత్త ఇంటెలిజెంట్ యుఐ ద్వారా వినియోగదారులు చాట్‌బాట్‌లోనే నేరుగా కాలిక్యులేటర్లు, బిల్ స్ప్లిటర్లు, ఇంటరాక్టివ్ మ్యాప్‌లు మరియు ఆడుకునేందుకు వీలుగా గేమ్స్‌ను సైతం క్షణాల్లో రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు ప్రయాణ ప్రణాళిక గురించి అడిగితే వెళ్లాల్సిన ప్రాంతాలను నేరుగా మ్యాప్‌లో చూపిస్తుంది. Plus, Pro, Business వినియోగదారులతో పాటు Free, Go ప్లాన్ల వినియోగదారులకు కూడా ఈ ఫీచర్‌ను దశలవారీగా అందిస్తున్నారు. చెల్లింపు వినియోగదారులకు GPT-6 Sol మోడల్, ఉచిత వినియోగదారులకు GPT-6 Luna మోడల్ అందుబాటులో రానున్నాయి. మరో విశేషమేమిటంటే.. సమాధానం పూర్తిగా సిద్ధమయ్యే వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా, రెస్పాన్స్ జనరేట్ అవుతుండగానే వినియోగదారులు సమాచారాన్ని చదవడం ప్రారంభించవచ్చు. వెబ్ సెర్చ్ వేగంలో GPT-6 మునుపటి మోడళ్ల కంటే 44 శాతం వేగంగా పనిచేస్తుందని సంస్థ తెలిపింది. వీటితో పాటు సైబర్ దాడులు, దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి మరియు భద్రతను మరింత కఠినతరం చేయడానికి బహుళ అంచెల సెక్యూరిటీ వ్యవస్థను కూడా ఓపెన్ ఏఐ ఈ మోడల్‌లో విలీనం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!

వ్యాపారులకు గుడ్‌ న్యూస్‌.. యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం

‘విజయ్’ పేరును స్టాలిన్’గా మార్చిన AI.. నెట్టింట రచ్చ!

APSRTC గుడ్ న్యూస్.. విశాఖ To భోగాపురం.. కొత్తగా నెలవారీ పాస్‌లు

ఇ-కామర్స్‌ డెలివరీ సర్వీస్‌లపై 5% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ!

Loading...
Unable to load recommendations.
Follow Us