ఆకాశంలో వింత లైట్‌ చక్కర్లు.. మనపై దాడి చేసేందుకు ఏలియన్స్‌ రెడీ..?

|

Jun 12, 2022 | 5:29 PM

గత కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో వెండి రంగులో ఉన్న లోహపు బాల్స్‌ పడ్డాయి. ఇక వాటిని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అవేంటో తెలియక..

గత కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో వెండి రంగులో ఉన్న లోహపు బాల్స్‌ పడ్డాయి. ఇక వాటిని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అవేంటో తెలియక..దీనికి కారణం ఏమై ఉంటుందో తెలియక భయాందోళనలకు గురి అయ్యారు. ఇక వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే తాజాగా ఇప్పుడు అలాంటి ఓ వెరైటీ ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఆకాశంలో వింతగా గ్రీన్‌ లైట్‌ కనిపించింది. దీంతో ఏలియన్‌ దాడిగా నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆకాశంలో ఆకుపచ్చ రంగులో కాంతి కనిపించింది. గ్రీన్‌ రంగులోని గ్రహశకలం మాదిరిగా ఇది ఉన్నట్లు దీనిని చూసిన కొందరు తెలిపారు. స్కాట్స్‌విల్లే, డర్బన్, జోహన్నెస్‌బర్గ్ ప్రాంతాల్లో ఈ వింత కాంతిని చూసినట్లు చాలా మంది ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఏలియన్లు వచ్చేశాయి.. అవి దాడి చేసేందుకు రెడీ అవుతున్నాయ్‌ అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఫ్యాన్స్ కు భయపడే.. అలా చేస్తున్నా..’ ఫస్ట్ టైం ఒపెన్ గా మాట్లాడిన పవన్

దయచేసి మమ్మల్ని క్షమించండి.. నయన్ – విఘ్నేష్ బహిరంగ లేఖ..

టర్కిష్ ఐస్ క్రీం విక్రేతకే చుక్కలు చూపించిన కామన్‌మ్యాన్ !!

Published on: Jun 12, 2022 05:29 PM