ఫేక్‌ కాల్స్‌ భరతం పట్టనున్న గూగుల్‌.. ఎలా అంటే!

Updated on: Jun 06, 2026 | 6:03 PM

ఏఐ వాయిస్ క్లోనింగ్, ఫోన్ నంబర్ స్పూఫింగ్ వంటి సైబర్ మోసాలను అరికట్టేందుకు గూగుల్ ‘ఫేక్ కాల్ డిటెక్షన్’ అనే కొత్త భద్రతా ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. కాల్ చేసిన వ్యక్తి నిజంగా అదే డివైజ్ నుంచి కాల్ చేస్తున్నాడో లేదో ఈ సిస్టమ్ గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 పై వెర్షన్ ఫోన్లలో ఈ ఫీచర్ దశలవారీగా అందుబాటులోకి రానుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వాడుకుంటూ సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న సరికొత్త మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు గూగుల్ సిద్ధమైంది. ప్రస్తుతం కేటుగాళ్లు ‘ఫోన్ నంబర్ స్పూఫింగ్’, ‘ఏఐ వాయిస్ క్లోనింగ్‌తో తెలిసిన వారిలా నమ్మిస్తూ అమాయకులను దోచుకుంటున్నారు. వీటికి చెక్ పెడుతూ గూగుల్ తన ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం విప్లవాత్మక ‘ఫేక్ కాల్ డిటెక్షన్’ పేరుతో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా ఏఐ వాయిస్ స్కామ్‌ల నుంచి యూజర్లకు మరింత రక్షణ లభించనుంది. సైబర్ నేరగాళ్లు సాఫ్ట్‌వేర్ల సాయంతో ఫోన్ నంబర్లు, వాయిస్‌లను మార్చినప్పటికీ.. అవతలి వ్యక్తి చేసిన కాల్ నిజంగా ఆ డివైజ్ నుంచే వచ్చిందో లేదో ఈ ఫీచర్ ఇట్టే పసిగడుతుంది. రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ టెక్నాలజీ ద్వారా ఒక సైలెంట్ సిగ్నల్ పంపడం ద్వారా దీనిని నిర్ధారించుకుంటుంది. ఒకవేళ ఎవరైనా మోసగాడు మీ బంధువుల నంబర్‌ను స్పూఫ్ చేసి, ఏఐతో వారి గొంతును అనుకరించి కాల్ చేసినా ఈ ఫీచర్ పసిగడుతుంది. “ఈ కాల్ బహుశా ఆ వ్యక్తి నుంచి కాకపోవచ్చు” అంటూ స్క్రీన్‌పై హెచ్చరిక చూపిస్తుంది. వెంటనే కాల్ కట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తుంది. కాల్ మాట్లాడుతున్న ఇద్దరు వ్యక్తులు తమ మొబైల్స్‌లో ‘గూగుల్ ఫోన్ యాప్’ వాడుతుంటే ఇది పనిచేస్తుంది. కాల్ రాగానే రెండు డివైజ్‌ల మధ్య తెరవెనుక ఒక ‘డిజిటల్ హ్యాండ్‌షేక్’ లాంటి వెరిఫికేషన్ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఈ ఫీచర్ వల్ల వ్యక్తిగత డేటాకు ఎలాంటి ముప్పూ ఉండదని గూగుల్ స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ 12 ఆపై వెర్షన్ ఉన్న ఫోన్లలో ఈ నెల నుంచే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. మొదట గూగుల్ పిక్సెల్ ఫోన్లలో, ఆ తర్వాత దశలవారీగా అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్‌లోనూ ఈ అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్ పనిచేస్తుందని గూగుల్ వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారుణం.. చిన్నారి కాలి ఎముకను విరగ్గొట్టిన డాక్టర్‌.. కారణం ఇదే

ఐఆర్‌సీటీసీ బిగ్ ఆపరేషన్.. 3 కోట్ల అకౌంట్లు బ్లాక్

చెట్టుపైనుంచి నోట్ల వర్షం కురిపించిన కోతి.. వానరం ఎంత పని చేసింది!

ఏఐ వద్దు.. ఉద్యోగులే ముద్దు.. పెరిగిన ఏఐ ఖర్చు.. కంపెనీల పునరాలోచన

రోడ్డుపై కరెన్సీ నోట్లు విసిరేసి.. ఓ రేంజ్‌లో పోలీస్‌ దొంగా ఛేజింగ్

Follow Us